---Advertisement---

ప్రకాశ్ రాజ్ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’లో ఎంట్రీ.. వైరల్‌గా మారిన సెటైరికల్ వీడియో!

May 22, 2026

Summarize with AI

---Advertisement---

సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతున్న “కాక్‌రోచ్ జనతా పార్టీ” (CJP)లో ప్రముఖ నటుడు  ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఎంట్రీ ఇవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. తనదైన వ్యంగ్య శైలిలో రాజకీయాలపై స్పందిస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగమయ్యారు. ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ ఐస్‌క్రీమ్‌లో మామిడి పండు గుజ్జును కలుపుకుని తింటూ కనిపించారు. అయితే వీడియోలో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన క్యాప్షన్ మరింత చర్చకు కారణమయ్యాయి. “బొద్దింకలు మామిడి పండ్లను ఎలా తింటాయో చూడండి” అంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)కు ఇష్టమైన పండుగా చెప్పుకునే మామిడిని ప్రస్తావిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

“కాక్‌రోచ్ ఈటింగ్ మ్యాంగోస్.. యమ్మీ” అంటూ #CockroachJantaParty, #justasking హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రకాష్ రాజ్ ఈ వీడియోను పోస్టు చేశారు. 61 ఏళ్ల ఈ నటుడు మొదటి నుంచే కాక్‌రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతూ.. వాటి పోస్టులను కూడా షేర్ చేస్తున్నారు. యువతలో ఈ వ్యంగ్య ఉద్యమంపై మరింత చర్చ పెరగడానికి ఆయన పోస్టులు కారణమవుతున్నాయి.

ఇది కేవలం ప్రకాష్ రాజ్‌తోనే ఆగిపోలేదు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap)తో పాటు నటీమణులు దియా మీర్జా(Dia Mirza), ఈషా గుప్తా(Esha Gupta), ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh), దర్శకుడు కునాల్ కోహ్లీ(Kunal Kohli) వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పార్టీ అధికారిక అకౌంట్లను ఫాలో అవుతున్నారు.

30 ఏళ్ల డిజిటల్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే ప్రారంభించిన ఈ వ్యంగ్య ప్రచారం మొదట చిన్న సోషల్ మీడియా జోక్‌లా మొదలైంది. కానీ ఇప్పుడు అది భారీ డిజిటల్ ఉద్యమంగా మారింది. మే 16న ప్రారంభమైన కాక్‌రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ కేవలం 6 రోజుల్లోనే 1.9 కోట్ల ఫాలోవర్ల మార్క్ దాటడం విశేషంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment