---Advertisement---

చంద్రబాబు బినామీల కోసమే అమరావతి ఫ్లైఓవర్లు..? రోజా సంచలన ఆరోపణలు!

May 22, 2026

---Advertisement---

అమరావతి (Amaravati) ఫ్లైఓవర్ల నిర్మాణం (Flyovers Construction) పేరుతో భారీ స్థాయిలో ప్రజాధనం దోచుకుంటున్నారని మాజీ మంత్రి రోజా (Roja) తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు (Chandrababu) తన బినామీలకు (Benamis) లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. వైసీపీ (YSRCP) అధినేత జగన్ (YS Jagan) చేసిన విమర్శలకు మద్దతుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా.. ప్రభుత్వ పనితీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.

నేషనల్ హైవే నిర్మాణానికి (National Highway Construction) సాధారణంగా కిలోమీటర్‌కు రూ.24 కోట్లు మాత్రమే ఖర్చవుతుంటే, అమరావతిలో మాత్రం అదే పనులకు కిలోమీటర్‌కు రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారని రోజా ఆరోపించారు. ఇది సాధారణ వ్యయం కాదని, ఇందులో భారీ అవినీతి దాగి (Massive Corruption) ఉందని వ్యాఖ్యానించారు.

విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌ను వైసీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాంలో కిలోమీటర్‌కు రూ.69 కోట్లతో పూర్తి చేశామని, ఇప్పుడు అమరావతిలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లకు కిలోమీటర్‌కు రూ.189 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ భారీ వ్యత్యాసానికి సమాధానం చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు.

ప్రజల డబ్బుతో బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం (Alliance Government) వ్యవహరిస్తోందని రోజా ఆరోపించారు. ఈ అంశంపై ప్రజలకు పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చంద్రబాబును నేరుగా ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment