---Advertisement---

చంద్రబాబు పొదుపు మంత్రం ఆరోజు హెడ్లైన్లకే పరిమితమా?

May 22, 2026

---Advertisement---

చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదనే విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ ప్రకటనలు పత్రికల శీర్షికల వరకే పరిమితం అవుతున్నాయే తప్ప, ఆచరణలో మాత్రం కనిపించడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో(Cabinet Meeting) “పొదుపు చర్యలు” పేరుతో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి.

దేశ ఆర్థిక పరిస్థితులను (Economic Conditions) దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా పొదుపు మార్గంలో నడవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Nara Chandrababu Naidu) పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని మంత్రులు, అధికారులు తమ వాహన వినియోగాన్ని తగ్గించాలని, ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యాలయాల్లో ఏసీలను 24-26 డిగ్రీల మధ్య ఉంచాలని, విదేశీ పర్యటనలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు.

అలాగే వారంలో ఒకరోజు “నో వెహికిల్ డే” (No Vehicle Day) పాటించాలని, సాధ్యమైనంత వరకు ఆర్టీసీ బస్సులను (RTC Buses) వినియోగించాలని, సైక్లింగ్ (Cycling) లేదా పాదయాత్రల ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచనలు ఇచ్చారు. సమావేశాలను కూడా వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రకటనలు పెద్ద ఎత్తున ప్రచారం పొందాయి.

అయితే ఆ నిర్ణయాలు అమల్లో కనిపించడం లేదనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశం జరిగిన కొన్ని రోజులకే మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) రష్యా పర్యటనకు (Russia Tour) సిద్ధమవడం చర్చనీయాంశమైంది. జూన్ 2 నుంచి 6 వరకు ఆయన విదేశీ పర్యటనకు సంబంధించి జీవో కూడా వెలువడింది. ఒకవైపు ఏడాది పాటు విదేశీ పర్యటనలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, మరోవైపు తక్షణమే ఆ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక కడప పర్యటనకు కూడా లోకేష్ ప్రత్యేక విమానంలో వెళ్లడం విమర్శలకు దారితీసింది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక విమాన ప్రయాణాలపై వస్తున్న విమర్శలకు ఇది మరింత బలం చేకూర్చిందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. “పొదుపు”(Savings) అనే మాట ప్రజలకేనా? మంత్రులకు మినహాయింపులా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇంకా “నో వెహికిల్ డే”గా ప్రకటించిన మొదటి శుక్రవారం రోజునే అమదాలవలసలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు (Kinjarapu Ram Mohan Naidu) భారీ వాహన కాన్వాయ్‌తో హాజరుకావడం, నెల్లూరు నుంచి ఆత్మకూరుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) పెద్ద ఎత్తున వాహనాలతో పర్యటించడం విమర్శలకు కారణమయ్యాయి. దీంతో “నో వెహికిల్ డే” నిర్ణయం కేవలం ప్రచారానికే పరిమితమైందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. “ప్రజలకు పొదుపు బోధనలు… నేతలకు ప్రత్యేక విమానాలు, భారీ కాన్వాయ్‌లా?” అంటూ సోషల్ మీడియాలో కూడా వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని ప్రస్తావిస్తూ, “ఆయన మాటలు ఆరోజు హెడ్లైన్ల కోసమే తప్ప, ఆచరణలో మాత్రం కనిపించవు” అంటూ విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment