---Advertisement---

సమస్యల మోత మోగుతున్నా… ప్రజలకు కనిపించని అమాత్యులు ?

May 23, 2026

---Advertisement---

కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకునే నాయకులే కనబడటం లేదనే విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నమ్మి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నా, నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు కనిపించకుండా పోయారని అనేక ప్రాంతాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇటీవల జిల్లాల్లో తీవ్ర గ్యాస్ కొరత (Gas Shortage) నెలకొనడంతో సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు (Cylinders Black Market) తరలిపోయాయనే ఆరోపణలు వినిపించాయి. బుక్ చేసిన సిలిండర్లు ఇళ్లకు చేరడానికి 20 రోజులకుపైగా పట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధులు స్పందించలేదనే భావన ప్రజల్లో బలపడింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) కొరత ఏర్పడి సామాన్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయినప్పటికీ ప్రజల తరఫున అధికారులతో చర్చించి పరిష్కారం చూపే నాయకత్వం కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే మండుతున్న ఎండలు, మరోవైపు తాగునీటి కొరతతో (Drinking Water Shortage) అనేక నియోజకవర్గాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ నాయకులు ముందుకు రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగునీటి అంశాలపై సమీక్షలు జరిపి రైతులకు భరోసా ఇవ్వాల్సిన నాయకులు కలెక్టరేట్ వైపు కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎదురైన యూరియా కొరత మళ్లీ వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న కరెంటు కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అయినా వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు.

పారిశుధ్యం నుంచి ఆసుపత్రుల్లో మందుల కొరత వరకు, తాగునీటి సమస్యల నుంచి రైతులకు(Farmers) మద్దతు ధర వరకు అనేక అంశాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అయినా వారిని పట్టించుకోవడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అభివృద్ధి, ఉపాధి గురించి పెద్ద ఎత్తున సభల్లో మాట్లాడుతున్న శాసన సభ్యులు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలను మాత్రం పరిష్కరించలేకపోతున్నారనే అభిప్రాయం బలపడుతోంది. మీడియా ప్రచారాలకే పరిమితమైన పాలనలో ప్రజల జీవితాలకు భరోసా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment