తాడేపల్లిలో (Tadepalli) వైఎస్సార్‌సీపీ (YSRCP) విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి కీలక నేతలు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కో-ఆర్డినేటర్లు, అసెంబ్లీ ఇన్‌చార్జిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ హామీల అమలు, సర్ ప్రక్రియ వంటి అంశాలపై జగన్ కీలక దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబు పాలనపై (Chandrababu Governance) తీవ్ర విమర్శలు చేసిన జగన్(Jagan).. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్-6(Super-6), సూపర్-7(Super-7) హామీలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. మహిళలకు(Women’s) ఏడాదికి రూ.18 వేల ఆర్థిక సాయం (Financial Assistance), 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్(Pension), నిరుద్యోగ భృతి (Unemployment Allowance) వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీగా మారిందన్నారు.
పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్ర పన్నులు తగ్గించే అవకాశం ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబుకు అసహనం పెరుగుతోందని, ప్రశ్నించే వారిని తప్పుబట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
కూటమి ప్రభుత్వం (Alliance Government) అసలు అభివృద్ధి చేయలేక డైవర్షన్ రాజకీయాలకు దిగిందని జగన్ ఆరోపించారు. గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త వివాదాలు సృష్టించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు అమాయకులు కాదని, మంచి ఎవరు చేశారో గుర్తుంచుకుంటారని చెప్పారు. వైఎస్సార్ హయాంలోనూ, వైఎస్సార్‌సీపీ(YSRCP) పాలనలోనూ ప్రజలకు సంక్షేమం అందిందని గర్వంగా చెప్పగలమన్నారు.
వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు జగన్ ప్రకటించారు. చంద్రబాబు హామీల మోసాలను ప్రజలకు వివరించేలా బుక్‌లెట్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, 8 లేదా 9 తేదీల్లో నియోజకవర్గ టౌన్‌హాల్ సమావేశాలు, జూన్ 12న భారీ ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ప్రతి ఎమ్మెల్యే నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ సూచించారు. ఈ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ప్రజల ఆగ్రహం చంద్రబాబుకు స్పష్టంగా కనిపించేలా ఉద్యమాలు జరగాలని అన్నారు.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను (Local Body Elections) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో జరిగిన కుట్రలను ప్రజలు చూశారని, పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని, జరిగితే ఇన్‌చార్జిల వైఫల్యంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలతో కలిసి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని జగన్ సూచించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రజలకు అందిన పథకాలు ఎలా రద్దయ్యాయో ఇంటింటికీ వెళ్లి వివరించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో బాబు వెన్నుపోటు పాలనపై చర్చ జరగాలని పిలుపునిచ్చారు.
సర్ ప్రక్రియపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించారని ఆరోపించారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌లో 45 వేలకుపైగా ఓట్లు తొలగించారని, స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్‌లో 71 వేల ఓట్లు తీసేశారని చెప్పారు. ఓట్ల తొలగింపులు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
ఏపీలో(AP) కూడా ఓట్ల వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. కొద్దిపాటి ఓట్ల తొలగింపే ఎన్నికల ఫలితాలను మార్చేస్తుందని, కుప్పంలో అది ప్రత్యక్షంగా కనిపించిందన్నారు. ఓట్ల హిస్టరీ, మిస్టరీపై ప్రతి నాయకుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






