---Advertisement---

కూటమి హామీలు గాలికేనా..? మహానాడు కాదు ‘దగానాడు’ అంటూ రోజా ఫైర్‌

May 27, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో (Promises) ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) సీనియర్ నేత ఆర్కే రోజా (RK Roja) తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు (Mahanadu) పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం అసలు ప్రజా సమస్యలపై చర్చించకుండా “దగానాడు”(“Daganadu”)గా మారిందని ఆమె మండిపడ్డారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసేలా కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు (Diversion Politics) చేస్తోందని ఆరోపించారు.

ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించిన “సూపర్ సిక్స్”(Super Six), “సూపర్ సెవెన్”(Super Seven) హామీలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు మోసాల మానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని తెలిపారు. జూన్ 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.

మాజీ సీఎం జగన్ (Jagan) హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని రోజా విమర్శించారు. “ఈ 2 సంవత్సరాల్లో మీరు ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉందా?” అంటూ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

విద్యాశాఖ (Education Department) బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని, ఇప్పుడు అలాంటి వ్యక్తినే పార్టీ అధ్యక్షుడిగా నియమించారని నారా లోకేష్‌పై (Nara Lokesh) రోజా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యా రంగం క్షీణిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

రాష్ట్రంలో మహిళలపై (Womens) దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని రోజా ఆరోపించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు గతంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. “నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పుడే అమలు చేసి ఉండాలి కదా” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే సరైన తీర్పు ఇస్తారని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment