కర్ణాటక రాజకీయాల్లో (Karnataka Politics) గత కొంతకాలంగా కొనసాగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ముఖ్యమంత్రి (Chief Minister) సిద్దరామయ్య (Siddaramaiah) శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా (Resignation) చేశారు. దీంతో జూన్ 3న కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (D.K. Shivakumar) ప్రమాణ స్వీకారం (Oath Taking Ceremony) చేయనున్నారు. ఈ పరిణామం దక్షిణాది రాజకీయాల్లో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. బెంగళూరులోని (Bengaluru) ప్రముఖ ప్రదేశాల్లో ఒకటైన లోక్ భవన్ గ్లాస్ హౌస్ (Lok Bhavan Glass House) లేదా చారిత్రాత్మక విధాన సౌధ (Vidhana Soudha) గ్రాండ్ స్టెప్స్‌ను కార్యక్రమ వేదికగా ఎంపిక చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ వేడుకకు పార్టీ జాతీయ నాయకత్వం భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. పార్టీ అగ్రనేతలతో పాటు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీలు (Priyanka Gandhi) ప్రత్యేక అతిథులుగా పాల్గొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాబోయే ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీకే శివకుమార్ నాయకత్వంలో కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే అంశంపై ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది.








