---Advertisement---

విచారణకు ధైర్యంగా హాజరైన జగన్ పీఎస్.. కానీ చంద్రబాబు పీఎస్ ఎందుకు పరారయ్యారు? తెరపైకి పలు ప్రశ్నలు!

May 31, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరోసారి అధికార వర్గాల వ్యక్తిగత కార్యదర్శుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కుంభకోణం (Liquor Scam) దర్యాప్తులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పీఎస్‌గా(PS) పనిచేసిన కే. నాగేశ్వర రెడ్డిని (K. Nageswara Reddy) సిట్ అధికారులు (SIT Officials) పలుమార్లు విచారించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే సిట్ అధికారులు పిలిచిన ప్రతిసారి ఆయన విచారణకు హాజరై తమ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దర్యాప్తుకు సహకరిస్తున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తనపై ఆరోపణలు వచ్చినప్పటికీ విచారణకు (Investigation) ఎదురొడ్డి నిలబడటం ద్వారా కే. నాగేశ్వర రెడ్డి తనపై ఉన్న ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. తప్పు చేయలేదనే నమ్మకం ఉంటేనే అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందుకు వస్తారని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఇదే సమయంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ (Pendyala Srinivas) వ్యవహారం మరోసారి ప్రస్తావనకు వస్తోంది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు పీఎస్‌గా(PS) ఉన్న పెండ్యాల శ్రీనివాస్‌పై పలు అవినీతి ఆరోపణలు (Corruption Allegations) వచ్చాయి. ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ స్థాయిలో లెక్కల్లో చూపని ఆర్థిక లావాదేవీలు గుర్తించబడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

అలాగే గత టీడీపీ(TDP) ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) కూడా పెండ్యాల శ్రీనివాస్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కేసులో విచారణ సంస్థలు నోటీసులు జారీ చేసిన అనంతరం ఆయన విదేశాలకు వెళ్లిపోయిన ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. దర్యాప్తు సంస్థలు విచారణకు పిలుస్తున్న సమయంలో విదేశాలకు (Foreign Countries) వెళ్లిపోవడం వల్ల ఆయనపై వచ్చిన అనుమానాలు మరింత పెరిగాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఆ సమయంలో ప్రభుత్వ సేవలో ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని జారీ చేసిన ఆదేశాలను కూడా పట్టించుకోలేదని, దీంతో ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని అప్పటి పరిణామాలు గుర్తుచేస్తున్నారు. అనంతరం రాజకీయ పరిస్థితులు మారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తివేయబడటంతో ఆయన తిరిగి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కే. నాగేశ్వర రెడ్డి విచారణకు హాజరవుతున్న పరిణామాలు, గతంలో పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు వెళ్లిపోయిన ఘటన మధ్య పోలికలు తెస్తూ రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే అధికారుల ఎదుట హాజరై తన వాదనను వినిపించవచ్చని, కానీ విచారణకు దూరంగా ఉండటం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో “జగన్ పీఎస్ విచారణను ఎదుర్కొంటుంటే, చంద్రబాబు పీఎస్ ఎందుకు పరారయ్యారు?” అనే ప్రశ్న మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఆరోపణలు, విచారణలు, రాజకీయ వాదనలు పక్కన పెడితే ప్రజల ముందుకు వచ్చిన ఈ రెండు ఉదాహరణలు బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment