---Advertisement---

మీ రాజధాని మునుగుతుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానం – కల్వకుంట్ల కవిత

June 1, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ (Telangana) ఆవిర్భావ దినోత్సవాన్ని (Formation Day) పురస్కరించుకుని హైదరాబాద్‌లో (Hyderabad) నవనిర్మాణ సభ (Reconstruction Meeting) నిర్వహించాలని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నిర్ణయంపై తెలంగాణకు చెందిన ప్రముఖ మేధావులు, రాజకీయ నాయకుల నుంచి వరుసగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మాజీ చైర్మన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Dr. B.R. Ambedkar Open University) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (Prof. Ghanta Chakrapani) పవన్ కళ్యాణ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలోనే బలమైన నాయకత్వం, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఉన్నాయని, ఇతర రాష్ట్రాల నాయకులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకని ప్రశ్నించిన ఘంటా చక్రపాణి, అమరావతి నిర్మాణం మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా గతంలో ఉపవాసం చేసిన వ్యక్తి ఇప్పుడు నవనిర్మాణం గురించి మాట్లాడటం విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను గౌరవించాలని, తెలంగాణ ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఇక తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), లోకేష్‌లపై(Nara Lokesh) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బంజారాహిల్స్‌లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆమె, తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడం, రాజకీయ జోక్యం పెంచడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజధాని నిర్మాణం (Capital City) పూర్తి చేయలేకపోయిన కూటమి నాయకులు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కవిత విమర్శించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టేముందు, లోకేష్ బాబు మీ సెక్రటేరియట్‌లోకి (Secretariat) వాన నీళ్లు రాకుండా చూసుకోండి. ప్రతి వానాకాలం మీ రాజధాని మునుగుతుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో నవనిర్మాణ సభ నిర్వహించే ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment