---Advertisement---

పిఠాపురం జనసేన నేత వేదింపులు – న్యాయం చేయాలని మహిళ పోరాటం.

June 2, 2026

Summarize with AI

---Advertisement---

పిఠాపురం (Pithapuram) మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి (Garaga Krishna Swathi) తనకు మరియు తన చిన్న కుమార్తెకు చట్టబద్ధంగా రావాల్సిన ఆస్తి హక్కులు (Property Rights) ఇవ్వకుండా తన మామ జనసేన నాయకుడు వేదిస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) వెంటనే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన భర్త గరగ జగన్నాథ్ (Garaga Jagannath) 2021లో కోవిడ్ కారణంగా మరణించారని, ఆ తరువాత తన మామ గరగ సత్యానందం తనను మానసికంగా, ఆర్థికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

తన భర్తకు రావాల్సిన ఆస్తి వాటాను అడుగుతున్న నేపథ్యంలో మామ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని కృష్ణ స్వాతి తెలిపారు. గరగ సత్యానందం (Garaga Satyanandam) పిఠాపురంలోని జనసేన నాయకుడు కావడంతో పార్టీ కార్యాలయాల్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆమె వాపోయారు. తన భర్త కూడా జనసేన నాయకుడేనని, పార్టీ సభ్యత్వ కార్డు (Membership Card) చూపిస్తూ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

భర్త మరణించిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, కుటుంబ పెద్దగా నమ్మి సంతకాలు పెట్టానని, ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆస్తి విషయంలో మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఆస్తి కోసం ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందని ఊహించలేదని కంటతడి పెట్టారు.

స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా తన మామకే మద్దతు ఇస్తున్నారని ఆరోపించిన కృష్ణ స్వాతి, మంగళగిరి మరియు చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో (Hyderabad) పవన్ కళ్యాణ్ నివాసానికి రెండుసార్లు వెళ్లినా తన సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు మరియు తన కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని, ఈ వ్యవహారంపై తక్షణ విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె పవన్ కళ్యాణ్‌ను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట కుమార్తెతో కలిసి నిరసన వ్యక్తం చేసి తన గోడును మీడియా ముందు వెల్లడించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment