---Advertisement---

లిక్కర్ స్కామ్ కాదు.. కక్ష రాజకీయాలే: అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు

June 5, 2026

Summarize with AI

---Advertisement---

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పాలన పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుల కోసమే కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో అసలు ఉనికిలోనే లేని ‘లిక్కర్ స్కామ్’ను (Liquor Scam) సృష్టించి ప్రతిపక్ష నేతలను వేధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. మొదట రూ.30 వేల కోట్ల స్కామ్ (₹30,000 Crore Scam) జరిగిందని ప్రచారం చేశారని, తరువాత మాట మార్చి రూ.3 వేల కోట్లకు తగ్గించారని ఎద్దేవా చేశారు. అసలు ఎక్కడ అవినీతి జరిగిందో ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టంగా చూపించలేకపోయిందన్నారు.

కేఎన్నార్ (KNR) నుంచి ఆఫీస్ అటెండర్ వరకు అందరికీ నోటీసులు ఇస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ఫ్లోర్ క్లీనర్లకు కూడా నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ దర్యాప్తు వ్యవస్థ పూర్తిగా ప్రతీకార రాజకీయాలకు వేదికగా మారిందన్నారు.

మద్యం విధానంలో మార్పులు తీసుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం దుకాణాలను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సిండికేట్లు ఏర్పడి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నాయని అన్నారు. మద్యం షాపుల్లో (Liquor Shops) ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారని, ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న కోట్ల రూపాయల డబ్బు నేరుగా చంద్రబాబు, నారా లోకేష్(Nara Lokesh)జేబుల్లోకే వెళ్తోందని సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో నకిలీ మద్యం (Fake Liquor) ఏరులై పారుతోందని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో విక్రయిస్తున్న ప్రతి 5 బాటిళ్లలో 1 బాటిల్ నకిలీ మద్యం సీసానే ఉంటోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ టీడీపీ(TDP) నేత జయచంద్రారెడ్డిని (Jayachandra Reddy) ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

తమకు అనుకూలంగా ఉండే అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి నిజాలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి విమర్శించారు. ‘సిట్’(SIT) పేరుతో ప్రతిపక్ష నేతలను బెదిరిస్తూ ప్రభుత్వం భయపెట్టే రాజకీయాలకు పాల్పడుతోందని అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment