---Advertisement---

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టిన కవిత వ్యాఖ్యలు!

June 6, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) సంబంధించిన కోడి చెరువు భూమి (Kodi Cheruvu Land) వ్యవహారం రోజురోజుకూ మరింత వివాదాస్పదంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన కొందరు డిజిటల్ జర్నలిస్టులు ఈ భూమిని చెరువు శిఖం భూమిగా పేర్కొంటూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి తీసుకురావడంతో, ప్రస్తుతం ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎదుర్కొంటున్న కోడి చెరువు భూమి వివాదంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువును తాను ఆక్రమించానని నిరూపితమైతే వెంటనే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారని గుర్తు చేసిన ఆమె, ఇరిగేషన్ శాఖ రికార్డులు ఈ భూమి చెరువు శిఖం భూమేనని స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్‌లోని టీఆర్ఎస్(TRS) కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, కోడి చెరువు పరిధిలోని భూమి రిజిస్ట్రేషన్ సమయంలో అనేక అక్రమాలు, లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో 10 ఎకరాల్లో 3 ఎకరాలను మాత్రమే శిఖం భూమిగా, మిగిలిన 7 ఎకరాలను మాగాణి భూమిగా నమోదు చేశారని, అయితే ఇరిగేషన్ రికార్డుల ప్రకారం మొత్తం 10 ఎకరాలూ చెరువు శిఖం భూమిగానే నమోదై ఉన్నాయని ఆమె వెల్లడించారు.

ఈ విషయానికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న కవిత, పవన్ కళ్యాణ్ వెంటనే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉన్న పరిహారం లేదా టీడీఆర్ (TDR) (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) తీసుకుని, ఆ భూమిపై వేసిన కంచెలు, మట్టిని తొలగించి చెరువు భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి ఇవ్వాలని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలతో కోడి చెరువు భూమి వివాదం మరింత రాజకీయ వేడి రగిలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment