దుబాయ్‌లో(Dubai) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) భారతీయ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎమిరేట్స్ రోడ్డుపై (Emirates Road) చోటుచేసుకున్న ఈ భయానక ప్రమాదంలో 7 మంది భారతీయ కార్మికులు (Indian Workers) ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy in Dubai) అధికారికంగా ధృవీకరించింది.
దుబాయ్ ట్రాఫిక్ పోలీసుల (Dubai Traffic Police) ప్రాథమిక విచారణ ప్రకారం సాంకేతిక లోపం (Technical Failure) కారణంగా ఒక భారీ ట్రక్కు (Heavy Truck) ఎమిరేట్స్ రోడ్డుమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయింది. అదే సమయంలో కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు (Mini Bus) డ్రైవర్ ముందున్న వాహనాన్ని గమనించకపోవడంతో పాటు సురక్షిత దూరాన్ని పాటించకపోవడం వల్ల ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదం తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో గాయపడిన 9 మందిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే భారత రాయబార కార్యాలయ అధికారులు ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న భారతీయులను (Indians) పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దుబాయ్ పోలీస్, స్థానిక ఆరోగ్య శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు ఎంబసీ తెలిపింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన కాన్సులేట్ జనరల్ (Consulate General) మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. దీంతో భారత్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Deeply saddened by the tragic road accident in Dubai that claimed the lives of several Indian workers.
— India in Dubai (@cgidubai) June 8, 2026
Our officials visited the hospital, met the injured Indians, and are working closely with local authorities to provide all possible assistance and support.
Our heartfelt…








