విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’(Adarsha Kutumbam House No:47) సినిమా విడుదల తేదీ (Release Date) ఖరారైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా చిత్రబృందం అధికారిక పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది.
వెంకటేశ్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలకు యాక్షన్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడటంతో ఎదురుచూస్తున్న అభిమానులకు తాజా ప్రకటన ఊరటనిచ్చింది.
ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) నటిస్తున్నారు. నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) కీలక పాత్రలో కనిపించనుండగా, నారా రోహిత్(Nara Rohith), రావు రమేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు.
వెంకటేశ్ కామెడీ టైమింగ్, కుటుంబ భావోద్వేగాలు, త్రివిక్రమ్ సంభాషణలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. విడుదల తేదీ ఖరారు కావడంతో సినిమా ప్రచార కార్యక్రమాలపై కూడా ఆసక్తి పెరిగింది. ఈ క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలుసుకోవాలంటే అక్టోబర్ 30 (October 30) వరకు వేచి చూడాల్సిందే.







