సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు (Superstar Rajinikanth) టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ (Sanju Samson) వీరాభిమాని. తన అభిమాన నటుడిపై ప్రేమను మరోసారి చాటుకున్న సంజు.. రజనీ నటించిన ‘జైలర్ 2’ (Jailer 2) సినిమాను చూసేందుకు ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రజనీకాంత్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని సంజు గతంలో పలుమార్లు చెప్పాడు. అయితే ఢిల్లీలో(Delhi) ఓ కార్యక్రమం కారణంగా ‘జైలర్ 2’ విడుదల రోజున సినిమా చూడలేకపోయాడు. దీంతో ఒక రోజు ఆలస్యంగా అయినా తన అభిమాన నటుడి సినిమాను పెద్ద తెరపై చూసేందుకు సిద్ధమయ్యాడు.
తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు టీమిండియా సహాయక సిబ్బందిలో తమిళం తెలిసిన కొందరితో కలిసి సినిమా చూడనున్నట్లు సంజు తెలిపాడు. రజనీకాంత్ సినిమాలంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, ఆయన తదుపరి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటానని పేర్కొన్నాడు.
రజనీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. తాజాగా సంజు శాంసన్ ‘జైలర్ 2’ కోసం థియేటర్ (Theatre) మొత్తాన్ని బుక్ చేసుకోవడం ద్వారా సూపర్‌స్టార్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.








