దేశ రాజకీయాల్లో డిజిటల్ సెన్సేషన్‌గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన సోషల్ మీడియా ఖాతాలపై వరుస దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, అలాగే పార్టీ బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా కొంతసేపు తొలగించి మళ్లీ పునరుద్ధరించారని వెల్లడించారు.
అభిజీత్ దీప్కే తెలిపిన వివరాల ప్రకారం.. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌పై పూర్తిగా యాక్సెస్ కోల్పోయానని చెప్పారు. మెటా రికవరీ ప్రాసెస్ ద్వారా అకౌంట్‌ను తిరిగి పొందేందుకు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. ప్రతి సారి రికవరీ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే “మీ భద్రత కోసం అకౌంట్‌ను లాక్ చేశాం. గుర్తింపును నిరూపించి కొత్త పాస్వర్డ్ సెట్ చేయాలి” అనే మెసేజ్ మాత్రమే వస్తోందని తెలిపారు. అయితే అన్ని వివరాలు ఇచ్చినా అకౌంట్ తిరిగి ఓపెన్ కావడం లేదని స్క్రీన్షాట్లతో సహా వెల్లడించారు.
ఈ పరిణామం సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్న యువతలో తీవ్ర ఆందోళన కలిగించింది. రాజకీయాలపై వ్యంగ్య పోస్టులతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ డిజిటల్ ఉద్యమం అకస్మాత్తుగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం చర్చనీయాంశమైంది.
ఇన్స్టాగ్రామ్ వివాదానికి ముందు ఈ వారంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను భారతదేశంలో నిలిపివేశారు. అయితే దీనికి ఏమాత్రం వెనక్కి తగ్గని పార్టీ కార్యకర్తలు వెంటనే “కాక్రోచ్ ఈజ్ బ్యాక్” పేరుతో కొత్త అకౌంట్ ప్రారంభించారు. “మమ్మల్ని ఆపేయగలరని అనుకున్నారా?.. లాల్” అంటూ తమపై వస్తున్న చర్యలను వ్యంగ్యంగా తీసుకుంటూ పోస్టులు పెట్టారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకంటే వేగంగా ఫాలోవర్లు పెరుగుతున్నందుకే తమ గొంతు నొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంకేతాలు కూడా ఈ పార్టీ వర్గాలు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కేవలం ఇంటర్నెట్ వ్యంగ్య ప్రచారంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రాజకీయ ఉద్యమంగా మారింది.
ఫాలోవర్ల పరంగా కూడా ఈ పార్టీ సంచలన రికార్డులు సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీని దాటి.. ఆ తర్వాత 141 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కూడా వెనక్కి నెట్టి.. అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన రాజకీయ గ్రూప్‌గా అవతరించడం విశేషంగా మారింది.
@Meta, I have lost access to my Instagram account. Trying to recover it but unable to. pic.twitter.com/bFXBWQAMwa
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 22, 2026
Crackdown on Cockroach Janta Party.
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 23, 2026
– Instagram page hacked.
– My personal Instagram hacked.
– Twitter account withheld
– Back up account also taken down.






