---Advertisement---

Allu Arjun: కోర్టుకు హాజరుకానీ అల్లు అర్జున్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు!

June 22, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్‌లోని(Hyderabad) సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటనకు (Stampede Incident) సంబంధించిన కేసు విచారణ సోమవారం నాంపల్లి కోర్టులో (Nampally Court) జరిగింది. ఈ విచారణకు సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారని ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో గైర్హాజరుకు సంబంధించిన మెమోను దాఖలు చేయాలని కోర్టు సూచించగా, అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్‌ను (Absent Petition) సమర్పించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ను భవిష్యత్ విచారణల్లో వర్చువల్ విధానంలో (Virtual Appearance) హాజరయ్యేందుకు అనుమతించాలా లేదా అనే అంశం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉందని సంధ్య థియేటర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. కేసులో ఉన్న ఇతర నిందితులతో కలిపి మొత్తం 21 మంది కోర్టుకు హాజరైనట్లు తెలిపారు.

రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు 11వ నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఆయన వ్యక్తిగత హాజరు కోసం కోర్టు సమన్లు (Summons) జారీ చేయగా, హాజరు కాలేకపోవడానికి గల కారణాలను ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

మరోవైపు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని (Sandhya Theatre Management) 1వ నిందితుడి నుంచి 10వ నిందితుడి వరకు చేర్చిన పోలీసులు మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇప్పటికే 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

2024 డిసెంబర్ 4న ‘పుష్ప-2′(Pushpa 2) బెనిఫిట్ షో (Benefit Show) సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ (Woman) ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sritej) తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment