---Advertisement---

అమరావతిలో అభివృద్ధి లేదు.. అంతా మార్కెటింగ్‌నే: అంబటి రాంబాబు

August 14, 2026

Summarize with AI

---Advertisement---

అమరావతి (Amaravati) నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేవలం ప్రచారం(Publicity), మార్కెటింగ్‌కే (Marketing) ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. అమరావతిలో చెప్పుకునే స్థాయిలో వాస్తవ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అమరావతి అద్భుత నగరం కాదని, అవినీతి(Corruption), దోపిడీకి (Exploitation) వేదికగా మారిందని ఆరోపించారు.

రాజధానిలో మౌలిక సదుపాయాల పేరుతో ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. కేవలం 21.77 కిలోమీటర్ల రహదారి (Road) నిర్మాణానికి రూ.1,519 కోట్లు ఖర్చు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.100 కోట్లతో పూర్తయ్యే రహదారి నిర్మాణం అంచనా వ్యయాన్ని రూ.365 కోట్లకు పెంచారని ఆరోపించారు.

అంచనాలు పెంచి..

అప్పులు (Loans) చేయడం, ప్రాజెక్టుల (Projects) అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టర్లకు (Contractors) లబ్ధి చేకూర్చడమే చంద్రబాబు పాలన విధానమని అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతిలో కేవలం అద్దాల కోసం రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఆరోపించారు.

రూ.80 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) కూడా తాత్కాలిక నిర్మాణమేనని చెప్పడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి అభివృద్ధి పేరుతో భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ, అందుకు తగ్గ స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని ఆయన ఆరోపించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment