---Advertisement---

అమరావతి చిత్రకళా వీధిలోనే రగడ.. కళా వేదికపై జనసేన నేతల వీరంగం.

August 8, 2026

Summarize with AI

---Advertisement---

అమరావతి చిత్రకళా వీధి (Amaravati Chitrakala Veedhi) ప్రారంభోత్సవం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్టాల్స్‌ను సందర్శించేందుకు వచ్చిన మంత్రి దుర్గేష్‌ (Minister Durgesh) అనుచరులు, జనసేన (Jana Sena) నేత బోనబోయిన శ్రీనివాస్‌ను (Bonaboyina Srinivas) డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) గన్‌మెన్‌ అడ్డుకోవడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలో జనసేన నేతలను గన్‌మెన్‌ పక్కకు నెట్టడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి తోపులాట, అరుపులు, కేకలతో ప్రాంగణం దద్దరిల్లినట్లు ప్రత్యక్షంగా ఉన్నవారు తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ (Pemmasani Chandrasekhar) సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మహిళలు, కళాకారులు, సందర్శకులు ఉన్న ప్రాంగణంలో నాయకుల మధ్య చోటుచేసుకున్న గొడవపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కళలు, సంస్కృతికి వేదికగా నిలవాల్సిన కార్యక్రమంలో బూతులు, వాగ్వాదాలు, తోపులాటకు దారితీసిన పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తమైంది.

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి (Art and Cultural Heritage) పరిచయం చేయడంతో పాటు కళాకారుల ప్రతిభకు విస్తృత వేదిక కల్పించడమే ‘అమరావతి చిత్రకళా వీధి’(Amaravati Chitrakala Veedhi) లక్ష్యమని నిర్వాహకులు ప్రచారం చేసిన నేపథ్యంలో, అదే వేదికపై రాజకీయ నేతల మధ్య రగడ చోటుచేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. “కళా, సాంస్కృతిక వైభవాన్ని చాటాల్సిన వేదికపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం” అంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందంటూ జనసేన నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment