---Advertisement---

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పై పీటీ వారెంట్ అస్త్రం,

February 8, 2026

Summarize with AI

---Advertisement---

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)పై పీటీ వారెంట్ జారీ అయింది. గతంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు (Police) ఆయనపై ఫ్ట్ వారెంట్ (FT Warrant) దాఖలు చేశారు.

ఆందోళన సందర్భంగా బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లిన ఘటనపై అప్పట్లోనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసులో తాజాగా కోర్టులో ఫ్ట్ వారెంట్ దాఖలవగా, ఈ నెల 11వ తేదీలోపు అంబటి రాంబాబును హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో రేపు అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ పిటిషన్‌లపై కూడా రేపే మొబైల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

కూటమి పాలనలో వైసీపీ నేతలను, కార్యకర్తలను పీటీ వారెంట్ల మాటున కక్ష సాదింపుకు టీడీపీ దిగుతుందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి అంబటి రాంబాబు తలవంచని నేపధ్యంలో ఆయనపై ఈ రకంగా రాజకీయ దాడి చేస్తున్నారని. ఇలాంటి దాడులకి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కాని భయపడే సమస్యలేదని ఆపార్టీ నేతలు పునరుద్ఘటించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment