---Advertisement---

అంబటి రాంబాబుపై మళ్లీ పీటీ వారెంట్… కోర్టులో హాజరుపర్చాలని జడ్జి ఆదేశం

February 11, 2026

Summarize with AI

---Advertisement---

మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)పై మరోసారి చట్టపరమైన చర్యలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్న ఆయనపై పోలీసులు తాజాగా మరో పీటీ వారెంట్ (PT Warrant) కోసం కోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

2023లో సత్తెనపల్లి (Sattenapalli)లో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీడ్రా నిర్వహించారని, ఆ కార్యక్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జనసేన (Janasena) గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు (Gade Venkateswara Rao) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన జడ్జి, అంబటి రాంబాబును ధర్మాసనం ఎదుట హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్ట్ అయి బెయిల్ పొందిన అంబటి రాంబాబుపై ఇది మరో కీలక పరిణామంగా మారింది. ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు ఏ దిశగా సాగుతాయో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment