---Advertisement---

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే యూఏపీఏ కేసులా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం: అంబటి రాంబాబు

July 6, 2026

Summarize with AI

---Advertisement---

రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం (Alliance Government) ఖూనీ చేస్తోందని వైఎస్సార్‌సీపీ(YSRCP) నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను (Law and Order) కాపాడాల్సిన పోలీసులు(Police) అధికార పార్టీ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ, యూట్యూబర్ ప్రశ్న రావణ్(Prashna Ravan), జర్నలిస్టు కేవీఆర్ (KVR) తమ పార్టీకి చెందిన వారు కాకపోయినా వారిపై నమోదు చేసిన అక్రమ కేసులను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే దానిని కోర్టులో నిరూపించాలే తప్ప, వరుసగా కేసులు నమోదు చేసి వేధించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రశ్న రావణ్‌ను 5 సార్లు అరెస్టు చేసి, బెయిల్‌పై(Bail) విడుదలైన ప్రతిసారీ మళ్లీ అరెస్టు(Arrest) చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు.

రిమాండ్ ఇవ్వడానికి కోర్టులు నిరాకరించడంతో వాటిని దాటవేయాలనే ఉద్దేశంతో యూఏపీఏ(UAPA) కేసు నమోదు చేయడం న్యాయవ్యవస్థకే సవాల్ విసిరినట్టేనని అంబటి వ్యాఖ్యానించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే చట్టాన్ని ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి వైఎస్సార్‌సీపీ పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. సాయి కృష్ణ(Sai Krishna), కాంతికుమార్(Kanthi Kumar), ప్రశ్న రావణ్(Prashna Ravan), కేవీఆర్(KVR) తమ పార్టీకి చెందిన వారు కాకపోయినా, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరి పక్షాన నిలబడతామని వెల్లడించారు.

బాధితులను నిందితులుగా మార్చే ధోరణిని వైఎస్సార్‌సీపీ(YSRCP) ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని అంబటి రాంబాబు హెచ్చరించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే యూఏపీఏ కేసులు, అధికారాన్ని పొగిడితే రక్షణ లభించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కనబెట్టి, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

తమను, తమ పార్టీని దూషించే వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మాత్రం వెంటనే అరెస్టు చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు.

ఈ ఏడాది జనవరి 31న తన నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నట్లు అంబటి రాంబాబు వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ దుర్మార్గమైన పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో తమ తీర్పును తప్పకుండా ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment