---Advertisement---

Anasuya: అనసూయ పోస్ట్‌తో టాలీవుడ్‌లో దుమారం.. ‘పెద్ది’ టీమ్‌కే పరోక్ష కౌంటరా?

June 6, 2026

Summarize with AI

---Advertisement---

టాలీవుడ్‌లో మరోసారి నటి అనసూయ (Anasuya) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా సమాజంపై సినిమాల ప్రభావం, క్రియేటివ్ ఫ్రీడమ్(Creative Freedom), దర్శక రచయితల బాధ్యతలపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’(Peddi) సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అయితే సినిమాలోని కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor) పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో అనసూయ చేసిన పోస్ట్ రావడంతో.. ఆమె పరోక్షంగా ‘పెద్ది’ టీమ్‌కే కౌంటర్ ఇచ్చారనే చర్చ మొదలైంది.

తన పోస్ట్‌లో అనసూయ సినిమాలు సమాజానికి అద్దంలాంటివేనని పేర్కొన్నారు. అయితే సమాజంలో జరిగే ప్రతీ తప్పుకూ సినిమాలనే కారణం చేయడం సరికాదన్నారు. పిల్లలకు విలువలు నేర్పాల్సింది కుటుంబమే గానీ సినిమాలు కాదని స్పష్టం చేశారు.

అలాగే దర్శకులు, రచయితలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని చెప్పిన ఆమె.. అదే సమయంలో సమాజం పట్ల బాధ్యత కూడా అవసరమని గుర్తుచేశారు. కొన్ని సందర్భాల్లో చెడును చూపిస్తున్నారా? లేక గ్లోరిఫై చేస్తున్నారా? అన్న తేడా మాయమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

తాను మాట్లాడితే మోరల్ పోలీసింగ్ అంటున్నారని, కానీ తన ఉద్దేశం సెన్సార్‌షిప్ కాదని.. కేవలం సామాజిక స్పృహ పెంచడమేనని అనసూయ క్లారిటీ ఇచ్చారు. గతంలో తన అభిప్రాయాల కారణంగా ఇండస్ట్రీలో ఒత్తిడులు ఎదుర్కొన్నానని, కొన్ని అవకాశాలు కూడా కోల్పోయానని వెల్లడించారు.

ప్రస్తుతం అనసూయ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది నిజంగానే ‘పెద్ది’ సినిమాపై పరోక్ష విమర్శేనా? లేక సాధారణ సామాజిక చర్చేనా? అన్నదానిపై నెటిజన్ల మధ్య భారీ డిబేట్ నడుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment