---Advertisement---

ఏపీలో ఫీడ్ సిండికేట్‌పై తిరుగుబాటు.. నేడు ఆక్వా రైతుల బంద్!

June 30, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) నేడు ఆక్వా రైతు సంఘాల (Aqua Farmer Associations) పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా బంద్ (Aqua Bandh) జరుగుతోంది. ఈ ఉద్యమంలో రైతులతో(Farmers) పాటు ఆక్వా ఫీడ్ డీలర్లు (Aqua Feed Dealers), యజమానులు కూడా పాల్గొనడం విశేషం. బంద్‌లో భాగంగా రైతులు చెరువుల్లో రొయ్యలు (Shrimp), చేపల (Fish) పట్టుబడులను నిలిపివేయగా, ఫీడ్ డీలర్లు స్వచ్ఛందంగా ఆక్వా ఫీడ్ (Aqua Feed), ఆక్వా మెడికల్ (Aqua Medical) షాపులను మూసివేశారు.

ఆక్వా ఫీడ్ కంపెనీలు సిండికేట్‌గా వ్యవహరిస్తూ మేత ధరలను భారీగా పెంచడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు (Chandrababu) ఆదేశాల మేరకు వనామీ ఫీడ్ ధరను కిలోకు రూ.12 నుంచి రూ.8కు తగ్గిస్తామని ప్రకటించినప్పటికీ, కేవలం రూ.2 మాత్రమే తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో టన్ను మేతపై అదనంగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రొయ్యల కొనుగోలు ధరలు కూడా పడిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని, ప్రభుత్వం తక్షణమే ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలకు మద్దతుగా డీలర్లు కూడా ముందుకు రావడం ఉద్యమానికి మరింత బలం చేకూర్చింది.

ఆచంట (Achanta), ఉండి(Undi), పాలకొల్లు (Palakollu), నరసాపురం (Narasapuram) నియోజకవర్గాల్లో ఫీడ్ షాపులు పూర్తిగా మూతపడగా, రైతుల వద్ద బకాయిలు పేరుకుపోతుండటంతో డీలర్లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ కంపెనీల తీరుపై రైతులు పలుమార్లు నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment