---Advertisement---

కూటమి నేతలపై వరుస లైంగిక ఆరోపణలు.. ఇప్పుడు క్యాబినెట్ మంత్రిపై ?

August 5, 2026

Summarize with AI

---Advertisement---

సోషల్ యాక్టివిస్ట్, ‘ప్యూర్’ స్వచ్ఛంద సేవా సంస్థ (PURE Voluntary Organization) వ్యవస్థాపకురాలు డాక్టర్ శైలజా తల్లూరి (Dr.Shailaja Talluri) ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లోని (Andhra Pradesh Cabinet) ఒక మంత్రిపై (Minister) తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు (Sexual Harassment Allegations) చేశారని ప్రచారం జరుగుతుంది. సదరు మంత్రి తనకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపారని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ, స్క్రీన్‌షాట్లను బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను(Nara Lokesh) నేరుగా ట్యాగ్ చేస్తూ “క్లీన్ అప్ యువర్ క్యాబినెట్ బ్రో”(Clean Up Your Cabinet Bro) అని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే కూటమికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులపై వివిధ రకాల లైంగిక వేధింపులు, మహిళలపై వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ తాజా ఆరోపణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) కోనేటి ఆదిమూలంపై (Koneti Adimulam) సొంత పార్టీ మహిళా నేతను బెదిరించి, బలవంతంగా లొంగదీసుకున్నారనే ఆరోపణలతో పాటు, ప్రైవేటు హోటల్‌లో ఉన్నట్లు చెబుతున్న బెడ్‌రూమ్ దృశ్యాలు, వీడియోలు బయటకు రావడం తీవ్ర దుమారం రేపింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై (Arava Sridhar) ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించడంతో పాటు అబార్షన్ చేయించారనే ఆరోపణలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై (Koona Ravi Kumar) కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ రెజిటీ సౌమ్య (Regiti Soumya) శారీరక, మానసిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ (Mohammed Naseer Ahmed) ఒక మహిళతో వీడియో కాల్‌లో అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్న వీడియో బయటకు రావడం కూడా వివాదాస్పదమైంది. అనంతరం ఈ ఘటన నిజమేనంటూ కొందరు టీడీపీ మహిళా నాయకురాళ్లు కూడా ఆరోపణలు చేయడంతో వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.

ఈ ఘటనల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో వరుసగా మహిళలకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, సంబంధిత ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిందితులను కాపాడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు(Law and Order), ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై (Public Representatives Conduct) ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment