---Advertisement---

రెండేళ్లకే కూటమి పాలనపై ప్రజల తిరుగుబాటు? వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసనల సెగ!

July 8, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాకముందే, పలువురు మంత్రులు(Ministers), ఎమ్మెల్యేలు(MLAs), ప్రజాప్రతినిధులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. భూ నిర్వాసితుల సమస్యలు, మత్స్యకారుల ఆందోళనలు, రైతుల ఇబ్బందులు(Farmers Problems), విద్యార్థిని ఆత్మహత్య కేసులో న్యాయం కోరుతున్న కుటుంబాలు, స్థానిక అభివృద్ధి పనులపై అసంతృప్తి, తాగునీటి కొరత(Drinking Water), భూముల వివాదాలు(Land Disputes), పరిశ్రమల వ్యతిరేక నిరసనలు వంటి అనేక అంశాలపై ప్రజలు నేరుగా ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.

అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్‌కు (Bulk Drug Park) వ్యతిరేకంగా మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. రాజమండ్రి సమీపంలో విద్యార్థిని వెన్నెల (Vennela) ఆత్మహత్య కేసులో న్యాయం కోరుతూ ఆమె తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్వాసితులు పరిహారం కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని (Ram Mohan Naidu) నిలదీయగా, విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో (Fishing Harbour) గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు మంత్రి కొల్లు రవీంద్రకు నిరసన వ్యక్తం చేశాయి.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరిపై రైతులు మంత్రి పార్థసారథిని (Parthasarathy) ప్రశ్నించగా, నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్‌కు (Kandula Durgesh) సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన ఎదురైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో తాగునీటి సమస్యపై మహిళలు మంత్రి గుమ్మడి సంధ్యారాణిని అడ్డుకోగా, వైఎస్సార్ కడప జిల్లాలో ఇసుక రవాణా అంశంపై మంత్రి సవితను రైతులు నిలదీశారు.

మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీ(TDP) కార్యకర్తలే ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్థసారథిపై కుల, మత వ్యాఖ్యల వివాదం చెలరేగగా, అనంతరం ఆయన క్షమాపణలు తెలిపారు. విజయవాడలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌కు అంజుమన్ భూముల అంశంపై నిరసన వ్యక్తమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) కార్యాలయాన్ని ముట్టడించి ఉద్యోగాలు, ఉపాధి భృతి కోసం ఆందోళన చేపట్టారు.

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు (Raghurama Krishnam Raju) సొంత నియోజకవర్గంలో నిరసనలు ఎదురుకాగా, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను (Koona Ravi Kumar) థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమకారులు అడ్డుకున్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవిని (Lokam Naga Madhavi) తుపాను ప్రభావిత ప్రాంతాల్లో స్థానికులు ప్రశ్నించగా, ఆమె సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన కూడా చర్చనీయాంశమైంది.

ఈ వరుస ఘటనలు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment