---Advertisement---

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 15 శాతమేనా? తెర వెనుక నడుస్తున్న నంబర్ గేమ్!

July 17, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రానున్న స్థానిక సంస్థల ఎన్నికల (Local Bodies Elections) నేపథ్యంలో కూటమి పార్టీల (Alliance Parties) మధ్య సీట్ల సర్దుబాటు అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ(TDP) 80%, జనసేన(Jana Sena) 15%, బీజేపీ(BJP) 5% నిష్పత్తిలో పోటీ చేసే అవకాశాలపై ఇప్పటికే లోకేష్(Nara Lokesh) లాంటి వారి దగ్గర నుండి ప్రకటనలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో జనసేనకు కేవలం 15 శాతం సీట్లు కేటాయించనున్నారనే వార్తలు ఆ పార్టీ క్యాడర్‌లో (Party Cadre) తీవ్ర అసంతృప్తికి దారితీశాయి.

టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokeshj) పార్టీ సమావేశంలో 80:15:5 నిష్పత్తిని ప్రస్తావించారు. అయితే, మొదట 15 శాతం ప్రకటించి, తర్వాత కొంత పెంచడం ద్వారా జనసేన క్యాడర్‌ను సంతృప్తిపరిచే వ్యూహం అమలు చేస్తున్నారనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. తొలుత “ఎన్ని సీట్లు వస్తాయనేది కాదు, ఎక్కడ గెలిచే బలం ఉందనేదే ముఖ్యం” అని వ్యాఖ్యానించిన ఆయన, కార్యకర్తల నుంచి వ్యతిరేక స్పందన రావడంతో తర్వాత పత్రికల్లో వచ్చిన 15 శాతం వార్తలు సరైనవి కావని, స్థానిక పరిస్థితులను బట్టి వాటాలు నిర్ణయించాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు కార్యకర్తలను శాంతింపజేసేందుకే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జనసేన కార్యకర్తలు మాత్రం కనీసం 30 శాతం సీట్లు ఆశిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ 15 లేదా 20 శాతానికే పరిమితమైతే, పార్టీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగడం కంటే టీడీపీతో(TDP) ద్వితీయ భాగస్వామిగా కొనసాగాల్సిన పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఏర్పడుతుందనే ఆందోళనలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ జనసేన అధిష్టానానికి మాత్రం పార్టీని పూర్తి స్థాయి రాజకీయ శక్తిగా మార్చాలన్న కోరిక కనిపించడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు కేవలం సంఖ్యల వ్యవహారం కాకుండా, కూటమి రాజకీయాల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది. చివరికి జనసేనకు ఎంత వాటా దక్కుతుంది? క్యాడర్ ఆశలు నెరవేరుతాయా? లేక ‘నంబర్ గేమ్’(Number Game)తోనే అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం జరుగుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఎన్నికల ప్రకటనతోనే తేలనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment