---Advertisement---

మధ్యాహ్న భోజన పథకంలో.. బల్లులు, బొద్దింకలు, కలుషిత ఆహారం! పిల్లల భోజనంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం వీడదా?

September 28, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాఠశాలలు(Schools), గురుకులాలు(Gurukuls), హాస్టళ్లలో(Hostels) విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం(Mid-Day Meal), అల్పాహారం(Breakfast), వసతి గృహాల (Hostel Food) ఆహార నాణ్యతపై వరుసగా ఫిర్యాదులు, అస్వస్థత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం పథకం అమలును ఘనంగా ప్రచారం చేస్తూ మంత్రులు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆహార భద్రత, పరిశుభ్రతపై ప్రశ్నలు మాత్రం కొనసాగుతున్నాయి. 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న రెండు ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలపై (Food Poisoning Incidents) జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) సుమోటోగా(Suo Motu) స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసిన విషయం కూడా నమోదైంది.

ఈ సమస్యకు తాజా ఉదాహరణగా కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో సాంబారులో బల్లి(Lizard) కనిపించిందన్న ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం అనంతరం 19 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలించబడ్డారు. విద్యార్థినులు సాంబారులో బల్లి కనిపించిందని పేర్కొన్నప్పటికీ, ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలపై అధికారుల విచారణ చేస్తాం అంటున్నారు. అదే సమయంలో వైఎస్సార్‌ కడప జిల్లా తొండూరు అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలోనూ భోజనం (Ambedkar Girls’ Gurukul School) అనంతరం విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన నమోదైంది.

ఇక గత రెండేళ్లలో అనంతపురం, వైఎస్సార్‌ కడప, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు తదితర జిల్లాల్లోని పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన ఘటనలను వరుసగా చూస్తున్నాం. కొన్ని చోట్ల కలుషిత ఆహారం, మరికొన్ని చోట్ల నిల్వ ఉంచిన ఆహారం, నాణ్యత లేని గుడ్లు(Poor-Quality Eggs), వండని లేదా సరిగా నిల్వ చేయని ఆహార పదార్థాలపై ఫిర్యాదులు వచ్చాయి.

2025 జూన్‌లో శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్‌లో టిఫిన్‌ అనంతరం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అదే నెలలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాలలో హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్‌లో బొద్దింక కనిపించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. అనంతరం 2025 జులైలో శ్రీకాళహస్తి బీసీ బాలికల వసతి గృహంలో ఉప్మాలో జెర్రి కనిపించిందన్న ఆరోపణలతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

2025 జులైలో నంద్యాల జిల్లా పాణ్యం గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో (Panyam Tribal Gurukul Boys’ School) 23 మంది విద్యార్థులు కడుపునొప్పి, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆహారం, నీటి నమూనాలను అధికారులు పరీక్షలకు పంపినట్లు అప్పట్లో వెల్లడించారు. 2025 ఆగస్టులో ఓర్వకల్లు ఎస్సీ బాలుర వసతి గృహంలోనూ విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు.

ఇక 2025లో కురుపాం గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల అనారోగ్యం, పచ్చకామెర్ల ఘటనలు తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఈ ఘటనలపై పార్లమెంట్‌లోనూ ప్రస్తావన వచ్చింది.

2026 ఫిబ్రవరిలో పోలవరం ప్రాంతంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆహారం కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కూడా నమోదైంది. 2026 జులైలో కడప రిమ్స్‌ డెంటల్‌ కళాశాల వసతి గృహంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలో సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అదే నెలలో పోలవరం జిల్లా వీఆర్‌పురం, అనకాపల్లి జిల్లా కోటవురట్లలో మధ్యాహ్నం మిగిలిన ఆహారాన్ని రాత్రి విద్యార్థులకు వడ్డించారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.

పిల్లలకు అందించే భోజనం విషయంలో నాణ్యత, పరిశుభ్రత, వంటశాలల నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వ, అధికారుల పర్యవేక్షణ వంటి అంశాలపై నిరంతర నిఘా అవసరం. పీఎం పోషణ్‌ వంటి పథకాల మార్గదర్శకాల్లోనూ వేడిగా, తాజాగా, సురక్షితమైన మరియు పోషకాహారాన్ని అందించడంతో పాటు వంట పాత్రలు, తాగునీరు, భోజన ప్రదేశాల పరిశుభ్రత, పర్యవేక్షణకు ప్రాధాన్యం ఉంది.

డొక్కా సీతమ్మ(Dokka Seethamma) వంటి సేవా భావానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి పేరును పథకానికి ఉపయోగించడం మాత్రమే కాకుండా.. ఆ పథకం క్షేత్రస్థాయిలో ఎంత నాణ్యంగా అమలవుతోందన్నదే అసలు ప్రశ్నగా మారింది. వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ప్రభుత్వం కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందన్న చర్చ కొనసాగుతోంది. ఇదే సమయంలో లోకేష్ ఆద్వర్యంలో ఉన్న విద్యాశాఖపై కూడా బాధ్యత, జవాబుదారీతనంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment