---Advertisement---

పోలీసుల సమక్షంలోనే దాడులా? ఏపీలో ఏం జరుగుతోంది!

February 6, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) నివాసంపై జరిగిన పెట్రోల్ బాంబుల దాడి నేపధ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చిందని ఆమె అన్నారు. పోలీసుల కళ్లముందే దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరమని, ఒక మాజీ మంత్రి ఇంటిపైనే దాడి జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏమిటని ఆమె ప్రశ్నించారు.

తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam)పై చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయని, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment