చంద్రబాబు పాలనలో ప్రజలకు న్యాయం కాకుండా భయమే మిగిలిందని వైఎస్సార్సీపీ(YSRCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా (Rule of Law) కాకుండా రూల్ ఆఫ్ ఫియర్ (Rule of Fear)’ నడుస్తోందని విమర్శించారు. అవినీతి(Corruption), అక్రమాలతో (Illegal Activities) రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు ప్రభుత్వ (Chandrababu Government) హయాంలో రైతులు(Farmers), కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రెడ్ బుక్ పాలనలో (Red Book Governance) ప్రజలకు(People) రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను (UAPA Act) ప్రయోగించడం దారుణమని, ఇంగిత జ్ఞానం లేని లోకేష్(Nara Lokesh) చేతిలో రాష్ట్ర భవిష్యత్తును పెట్టడం ప్రమాదకరమని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. పోలీసు లాకప్ డెత్‌లు (Lockup Deaths) జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి భారీ కమిషన్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని కూడా విమర్శలు గుప్పించారు.
వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి (Thopudurthi Prakash Reddy) కూడా భద్రత లేదని లక్ష్మీ పార్వతి అన్నారు. టిప్పర్‌తో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని, పైగా ఆయనపైనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. సాయికృష్ణ హత్య ఘటనలో బూడిద కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని 2 సంవత్సరాల పాటు నిలిపివేశారని, వైఎస్ జగన్ (YS Jagan) తీసుకొచ్చిన ప్రాజెక్టులకు ఇప్పుడు చంద్రబాబు(Chandrababu) క్రెడిట్(Credit) తీసుకుంటున్నారని విమర్శించారు. దావోస్ (Davos) పర్యటనల ద్వారా కొత్త పరిశ్రమలు తీసుకురాలేకపోయారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు భయభయంగా జీవిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.







