---Advertisement---

చంద్రబాబుపై ఆ మాటే … అరవ శ్రీధర్‌పై పవన్ కళ్యాణ్ చర్యలకు కారణమా?

May 23, 2026

---Advertisement---

జనసేన ఎమ్మెల్యే (Jana Sena MLA) అరవ శ్రీధర్ (Arava Sreedhar) ప్రభుత్వ విప్ (Government Whip) పదవికి రాజీనామా(Resignation) చేయడం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ‘చంద్రబాబు వేస్ట్’(Chandrababu Waste) అంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడం తర్వాత కేవలం 24 గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటికే అరవ శ్రీధర్‌పై (Arava Sreedhar పలుమార్లు మహిళ చేసిన ఆరోపణలు, బాధిత మహిళ(Women) విడుదల చేసిన వీడియోలు, అలాగే ఆయన అసెంబ్లీ వేదికగా చేసిన వీడియొ కాల్ అరాచకాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు నెలకొన్నాయి. అయితే చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో ఉద్దేశిస్తూ మాట్లాడిన వీడియో బయటకు రావడంతో వెంటనే విప్ పదవి తొలగింపుకు దారితీసేలా చర్యలు చేపట్టడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది.

ఇక ఇదే సమయంలో జనసేనకు చెందిన మరో కీలక నాయకుడు బాధిత మహిళ హర్ష వీనపై (Harsha Veena) నడి రోడ్డుపై పోలీస్ లాఠీతో దాడి చేసిన ఘటన కూడా వివాదాస్పదమైంది. ఈ పరిణామాలు జనసేన ప్రతిష్టను దెబ్బతీశాయని విమర్శలు వచ్చినప్పటికీ పార్టీ పెద్దలు నాడు పట్టించుకోలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కానీ చంద్రబాబు నాయుడిపై ఒక్క విమర్శ వచ్చిన వెంటనే అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి చంద్రబాబుపై తన అచంచల విశ్వాసాన్ని చాటుకున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు, మహిళల ఆరోపణలు కంటే రాజకీయ విధేయతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment