దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అయోధ్య (Ayodhya) రామమందిర (Ram Mandir) విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోట్లాది మంది భక్తులు (Devotees) సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామమందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ (Champat Rai) తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా (Anil Mishra) కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చంపత్రాయ్ (Champat Rai) వ్యక్తిగత డ్రైవర్ తో పాటు మరో ఎనిమిది మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh) ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
ప్రాథమిక దర్యాప్తులో రామమందిరానికి భక్తులు సమర్పించిన రూ.200 కోట్లకు పైగా విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుండీల్లో పడిన నగదు, విలువైన కానుకల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజీ (CCTV Footage) మాయమవడం, ఆలయ హుండీల తాళాలు అధికారిక ట్రస్ట్ ప్రతినిధుల వద్ద కాకుండా అనధికార వ్యక్తుల వద్ద ఉండటం వంటి అంశాలు దర్యాప్తును మరింత తీవ్రతరం చేశాయి.
ఈ పరిణామాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పందిస్తూ, “అయోధ్య మన విశ్వాసానికి ప్రతీక. నిరాధార ఆరోపణలు చేయొద్దు. శ్రీరాముడిని (Lord Shri Ram) గౌరవించడం నేర్చుకోండి. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముందే చెప్పాం. ఇప్పుడు నివేదిక వచ్చింది.. చర్యలు కూడా ప్రారంభమయ్యాయి” అని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) గతంలో జరిగిన తిరుమల లడ్డూ వివాదాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. రాజకీయ దురుద్దేశాలతో కూటమి నాయకులు తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనే ఆరోపణలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చినప్పటికీ, అనంతరం దర్యాప్తు సంస్థలు అలాంటి అంశంపై స్పష్టత ఇచ్చి, ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని వెల్లడించాయని వారు గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ ఆ అంశాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొనసాగించారని కూడా వారు పేర్కొంటున్నారు.
అప్పట్లో టీడీపీ, జనసేన ముఖ్య నాయకుల వ్యాఖ్యలు, ముఖ్యంగా తిరుమల లడ్డూలను అయోధ్యకు పంపించారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయని, నిరాధార ఆరోపణలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు అయోధ్యలో విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ, అక్కడి ప్రభుత్వం ఆలయ ప్రతిష్ఠను కాపాడాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ దర్యాప్తు ఆధారంగా చర్యలు చేపడుతుండగా, ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) తిరుమల(Tirumala) లడ్డూ (Laddu) వ్యవహారంలో ఆధారాలు లేని ఆరోపణలను పెద్ద రాజకీయ వివాదంగా మార్చడం వల్ల ఆలయ ప్రతిష్ఠ దెబ్బతిందనే చర్చ భక్తుల్లో కొనసాగుతోంది.
ఒకే తరహా మత విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో, తిరుమలలో నిర్ధారణ కాని ఆరోపణలను ప్రచారం చేసి ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి తీసుకురావడం, మరోవైపు అయోధ్యలో దర్యాప్తు సంస్థలు అవకతవకలపై విచారణ జరుపుతున్నప్పటికీ ఆలయ గౌరవాన్ని కాపాడుతూ చట్టపరమైన చర్యలు కొనసాగించడం చూస్తే రెండు ప్రభుత్వాల వైఖరిలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






