---Advertisement---

అయోధ్య రామ మందిర ట్రస్ట్ సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం!

September 2, 2026

Summarize with AI

---Advertisement---

అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) ట్రస్ట్‌కు కొత్త సీఈఓగా(CEO) రిటైర్డ్ ఎయిర్ మార్షల్(Retired Air Marshal) జితేంద్ర మిశ్రా (Jitendra Mishra) నియమితులయ్యారు. 5,000 మందికి పైగా అభ్యర్థులను పరిశీలించిన అనంతరం ఆయనను ఈ కీలక బాధ్యతలకు ఎంపిక చేసినట్లు సమాచారం. భారత వాయుసేనలో(Indian Air Force) జితేంద్ర మిశ్రా (Jitendra Mishra) కీలక హోదాల్లో సేవలందించడంతో పాటు పలు కమాండింగ్ బాధ్యతలను కూడా నిర్వహించారు.

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో భారత వాయుసేన పశ్చిమ కమాండ్ చీఫ్‌గా జితేంద్ర మిశ్రా (Jitendra Mishra) వ్యవహరించారు. సుదీర్ఘ అనుభవం, నాయకత్వ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని రామ మందిర ట్రస్ట్ సీఈఓ బాధ్యతలకు ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బుధవారం అయోధ్యలో జరిగిన రామ మందిర ట్రస్ట్ సమావేశం అనంతరం జితేంద్ర మిశ్రా నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ (Champat Rai) తన పదవికి రాజీనామా చేశారు.

ఈ పరిణామాల మధ్య జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఖాళీగా ఉన్న 3 ట్రస్టీ పదవులను భర్తీ చేసే అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఆలయ నిర్వహణ, పరిపాలనా వ్యవహారాలను మరింత సమర్థవంతంగా కొనసాగించడంపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.

ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్(Mahant Nritya Gopal Das), స్వామి కమలనయన్ దాస్(Swami Kamalnayan Das), తాత్కాలిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ మోహన్(Dr. Krishna Mohan), ట్రస్టీ మహంత్ దినేంద్ర దాస్(Mahant Dinendra Das), కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి (Swami Govind Dev Giri) తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఆలయ నిర్వహణ సజావుగా సాగడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ట్రస్ట్ మతపరమైన వ్యవహారాల కమిటీ సభ్యుడు స్వామి కమలనయన్ దాస్ సమావేశానికి ముందు తెలిపారు.

ట్రస్ట్ డీడ్‌లో సవరణలు, అధికారిక మీడియా ప్రతినిధి నియామకం, ఇతర పరిపాలనా అంశాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment