ప్రకాశం జిల్లా (Prakasam District) ఒంగోలులో (Ongole) కూటమి పార్టీల (Alliance Parties) మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) దామచర్ల జనార్దన్రావు(Damacharla Janardhan Rao), జనసేన (Jana Sena) నేత, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఎమ్మెల్యే దామచర్ల అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆదివారం బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన దామచర్ల కూడా బాలినేనికి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి ఎమ్మెల్యే దామచర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దామచర్లపై వచ్చిన అవినీతి ఆరోపణలపై (Corruption Allegations) సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రమాణం చేసేందుకు కాణిపాకం (Kanipakam) వెళ్లే సమయం చెప్పాలని, తాను కూడా ఆయనతో కలిసి వస్తానని బాలినేని వ్యాఖ్యానించారు.
ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల అర్ధరాత్రి వరకు సెటిల్మెంట్లకు(Settlements) పాల్పడుతున్నారని బాలినేని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంగోలులో జరుగుతున్న అరాచకాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) దృష్టికి తీసుకెళ్తానని బాలినేని తెలిపారు. జనసేన కార్యకర్తలు వేసిన ఓట్లతోనే దామచర్ల ఎమ్మెల్యేగా గెలిచారని వ్యాఖ్యానించారు.
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా (Resignation) చేసి స్వతంత్ర అభ్యర్థిగా (Independent Candidate) పోటీ చేయాలని దామచర్లకు బాలినేని సవాల్ విసిరారు. అలా పోటీ చేస్తే తాను 30 వేల ఓట్ల మెజార్టీతో (Majority) గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తాను ఓడిపోతే జీవితాంతం రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.






