---Advertisement---

Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్.. మరో సెక్షన్ యాడ్ చేసిన పోలీసులు

May 21, 2026

---Advertisement---

బండి భగీరథ్ కేసు (Bandi Bhagirath Case)లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే పోక్సో కేసుతో (POCSO Case) పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన నేపథ్యంలో.. తాజాగా పోలీసులు (Police) మరో కొత్త సెక్షన్‌ను (Section) జోడించడం సంచలనంగా మారింది. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ (Anticipatory Bail Petition) విషయంలో కూడా కీలక పరిణామం చోటుచేసుకుంది.

భగీరథ్ తరఫు న్యాయవాది హైకోర్టులో (High Court) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు మెమో దాఖలు చేశారు. భగీరథ్ అరెస్ట్‌కు ముందు ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును ఇవాళ వెల్లడిస్తామని తెలిపింది. అయితే ఇటీవల భగీరథ్ అరెస్ట్ కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న భగీరథ్‌పై పోలీసులు కొత్తగా 238 సెక్షన్‌ను జోడించారు. కీలక డిజిటల్ ఆధారాలను మాయం చేశాడన్న ఆరోపణలతో ఈ సెక్షన్ చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాడిన ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర డిజిటల్ డేటాను భగీరథ్ తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా విచారణను మరింత విస్తరించినట్లు సమాచారం.

ఇక ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)స్పందించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేసే వారని, పార్టీ కోసం ప్రాణాలు అర్పించే స్థాయిలో కమిట్‌మెంట్ ఉంటుందని అన్నారు.

తనను లక్ష్యంగా చేసుకుని ఇతర పార్టీల నేతలు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసింది బీజేపీయేనని, అందుకే తమపై అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. కేటీఆర్(KTR) ఫేక్ సోషల్ మీడియా వ్యవస్థను నడుపుతున్నారని ఆరోపించారు.

తన కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ స్పష్టం చేశారు. విచారణకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తనపై వస్తున్న విమర్శలను రాజకీయ కుట్రగా అభివర్ణించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment