---Advertisement---

మహిళను మోసం చేసిన మరో జనసేన నాయకుడు.

June 12, 2026

Summarize with AI

---Advertisement---

జనసేన పార్టీకి(Jana Sena Party) చెందిన నాయకులపై వరుసగా వివాదాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మరోసారి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ఆరోపణలు ముందుకు వచ్చాయి. ఈసారి జనసేన రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ బేతపూడి విజయ్ శేఖర్ (Betapudi Vijay Sekhar) తనను భారీగా మోసం చేశారని ఓ మహిళ (Woman) మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసింది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని చెప్పుకున్న ఆ మహిళ కథనం ప్రకారం, కరోనా (Corona) సమయంలో విజయ్ శేఖర్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, రాబోయేది జనసేన ప్రభుత్వమేనని నమ్మబలికి ఇసుక క్వారీలు(Sand Quarries), గ్రానైట్ వ్యాపారాలు(Granite Businesses), వైన్ షాపులు (Wine Shops) వంటి వ్యాపార అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి రూ.1.75 కోట్ల వరకు తన నుంచి తీసుకున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా బంగారాన్ని(Gold) కూడా తాకట్టు పెట్టించి డబ్బులు సమకూర్చుకున్నాడని ఆమె పేర్కొంది.

2024లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయ్ శేఖర్ పూర్తిగా తనను దూరం పెట్టాడని, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగడమే కాకుండా తనపై దాడి కూడా చేశాడని ఆమె ఆరోపించింది. మంగళగిరిలో (Mangalagiri) పరిచయమైన విజయ్ శేఖర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి పొందిన తరువాత పూర్తిగా వైఖరి మార్చుకున్నారని ఆమె మీడియా ఎదుట వాపోయింది.

తనకు న్యాయం చేయాలని జనసేన నిర్వహించే జనవాణి (Janavani) కార్యక్రమంలో మూడుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆమె తెలిపింది. తన సమస్య గురించి పార్టీ నాయకత్వంలోని పలువురికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, తనకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. తన మరణానికి జనసేన నాయకత్వమే బాధ్యత వహించాలని కూడా ఆమె పేర్కొంది.

ఇప్పటికే జనసేనకు చెందిన పలువురు నేతలపై వివిధ రకాల ఆరోపణలు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్‌పై (Kiran Royal) మహిళ వేధింపుల ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలు, అలాగే జయప్రకాశ్ నాయుడు, మల్లాడి రాజు, భైరవ ప్రసాద్, సూర్య చంద్ర, తిరుమాన వెంకట రాజు, జానీ మాస్టర్‌లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ వ్యవహార శైలిపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బేతపూడి విజయ్ శేఖర్‌పై వచ్చిన తాజా ఆరోపణలు కూడా జనసేన నాయకత్వ తీరుపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment