---Advertisement---

జగన్ చెప్పిన టైమ్‌లైన్‌కే భోగాపురం పూర్తి… మరి కుప్పం విమానాశ్రయం ఎక్కడ ఆగిపోయింది?

July 31, 2026

Summarize with AI

---Advertisement---

భోగాపురం (Bhogapuram) అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణంపై (International Greenfield Airport Construction) రాజకీయంగా క్రెడిట్ ఎవరిది అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తూ 2,751 ఎకరాల భూసేకరణను పూర్తి చేసింది. రైతులకు(Farmers) భూముల స్వభావాన్ని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం అందించడంతో పాటు, అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూములతో సమానంగా పరిహారం (Compensation) చెల్లించింది. నిర్వాసితులైన 404 కుటుంబాలకు అత్యుత్తమ పునరావాస ప్యాకేజీ అందిస్తూ సుమారు రూ.80 కోట్లతో రెండు ఆధునిక కాలనీలు నిర్మించింది.

ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న హైకోర్టు(High Court), సుప్రీంకోర్టు(Supreme Court), నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లోని (NGT) వివిధ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందేందుకు ఢిల్లీ స్థాయిలో చొరవ తీసుకుంది. అనంతరం 2023 మే 3న భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి, అదే సభలో 2026 నాటికి విమానాశ్రయం సిద్ధమవుతుందని జగన్ స్పష్టమైన టైమ్‌లైన్ (Timeline) ప్రకటించారు. అదే గడువులో విమానాశ్రయం పూర్తి కావడం ఆయన ముందుచూపుకు ఉదాహరణగా పలు వర్గాలు పేర్కొంటున్నాయి.

నిర్మాణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, విమానాశ్రయ నిర్మాణంలో ప్రభుత్వ బాధ్యత భూసేకరణ, పునరావాసం, అన్ని చట్టపరమైన మరియు పర్యావరణ అనుమతులు సాధించి నిర్మాణ సంస్థకు ఎలాంటి అడ్డంకులు లేకుండా భూమిని అప్పగించడం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన గడువులో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయడం జీఎంఆర్ వంటి నిర్మాణ సంస్థ బాధ్యతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 2023 నాటికే అవసరమైన అన్ని అనుమతులు పూర్తి చేసి భూమిని జీఎంఆర్‌కు (GMR) అప్పగించడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో, నిర్మాణ దశలో జరిగిన పనులను తమ ప్రభుత్వ ఘనతగా టీడీపీ (TDP) ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, 2019 ఎన్నికలకు ముందు కుప్పం విమానాశ్రయానికి (Kuppam Airport) కూడా శంకుస్థాపన చేసి ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామని నాడే ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ అక్కడ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అవసరమైన అనుమతులు లేకుండానే ఎన్నికల ప్రచారం కోసం శంకుస్థాపనలు చేసి గడువులు ప్రకటిస్తే అవి కుప్పం విమానాశ్రయం తరహాలోనే నిలిచిపోతాయి. అయితే అన్ని అనుమతులు పూర్తి చేసి, అమలుకు స్పష్టమైన ప్రణాళికతో టైమ్‌లైన్ ప్రకటిస్తే భోగాపురం విమానాశ్రయం తరహాలో వాస్తవ రూపంలోకి వస్తుందని వారు విశ్లేషిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment