---Advertisement---

అగోడ యాప్‌లో తిరుమల గదుల విక్రయం.. టిటిడిపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు

July 8, 2026

Summarize with AI

---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) వసతి గదుల బుకింగ్ (Accommodation Rooms Booking) వ్యవహారంలో భారీ లోపాలు చోటుచేసుకున్నాయని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఆరోపించారు. ప్రైవేట్ వెబ్‌సైట్‌తో పాటు అగోడ (Agoda) యాప్‌లో కూడా టీటీడీ వసతి గదులు బుకింగ్‌కు అందుబాటులో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. ఈ విషయానికి సంబంధించిన వీడియో ఆధారాలను కూడా ఆయన విడుదల చేశారు.

టీటీడీ అధికారికంగా రూ.1,000కు కేటాయించే వసతి గదులను ప్రైవేట్ యాప్‌ల ద్వారా రూ.18,000 వరకు విక్రయిస్తున్నారని భూమన ఆరోపించారు. ఆదిత్య బిర్లా(Aditya Birla Guest House), పాంచజన్యం(Panchajanyam Guest House), వకుళమాత గెస్ట్ హౌస్‌లకు (Vakulamatha Guest House) చెందిన గదులు అగోడ యాప్‌లో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యాల పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారంపై టీటీడీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

టీటీడీలో ఉన్న లోపాలను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా తమపైనే విమర్శలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా భక్తులు మోసపోతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో టీటీడీ విజిలెన్స్(Vigilance Wing) పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గతంలో తమ హయాంలో 48 నకిలీ వెబ్‌సైట్లపై ఫిర్యాదు చేసి వాటిని మూసివేయించిన విషయాన్ని గుర్తు చేశారు.

నకిలీ బుకింగ్ యాప్‌లపై టీటీడీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని భూమన ప్రశ్నించారు. భక్తులు ఆర్థికంగా నష్టపోతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు. నకిలీ యాప్‌ల నియంత్రణపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

నవనీతమ్మ వ్యవహారంపై కూడా భూమన స్పందించారు. వృద్ధురాలికి దర్శనం కల్పించడం తప్పు కాదని స్పష్టం చేశారు. ఆమె పాదయాత్ర చేయలేదని ఏ ఆధారాలతో నిర్ధారించారో ప్రభుత్వం వెల్లడించాలని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి, టీటీడీ ఛైర్మన్ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.

నవనీతమ్మ (Navaneethamma) పేరుతో రాజకీయ ప్రచారం జరుగుతోందని భూమన ఆరోపించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, టీటీడీ ఛైర్మన్ చేసిన ప్రకటనల్లో భిన్న సమాచారం ఉందని పేర్కొన్నారు. అసలు నిజాలు బయటకు రావాలంటే నవనీతమ్మ వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment