టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ విశ్వసనీయతపై మరోసారి చర్చ మొదలైంది. చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యల్లో చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడే నాయకుడని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా వైఎస్సార్ కంటే ముందే ఉచిత విద్యుత్ ప్రతిపాదన చంద్రబాబు గారి ముందుకు వచ్చిందని. కానీ, అసాధ్యమైన హామీలిచ్చి ఓట్లు వేయించుకుని ప్రజలను పిచ్చివాళ్లను చేయలేను, నేను ఏది చేయగలనో దాన్నే హామీగా ఇస్తా అని నాడు చంద్రబాబు తెగేసి చెప్పారని. ఆ తరువాత వైయసార్ కూడా ఇచ్చిన ఉచిత విధ్యుత్ హామీని నిలబెట్టుకోలేదని ఆమే చేసిన వాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి.
అయితే, గత ఎన్నికల మేనిఫెస్టోలు, అమలైన హామీలు, ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను, అధికారంలోకి వచ్చాక ఇచ్చ్చిన హామీలను దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ నిలుపుకున్న చరిత్రను గుర్తు చేస్తూ పలువురు భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నరు.
చంద్రబాబు గారి విశ్వసనీయత గురించి భువనేశ్వరీ గారు మాట్లాడిన మాటలకే విస్వసనీయత లేదని 1994, 1999, 2014, 2024 ఎన్నికల మేనిఫెస్టోలలో ప్రకటించిన పలు కీలక హామీలు చంద్రబాబు హయాములో అమలు కాలేదని మరి ఎక్కడ ఉందో చంద్రబాబు గారికి విశ్వనీయత అంటూ ప్రశ్నిస్తున్నారు. 1994లో రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, తక్కువ ధరకు విద్యుత్ వంటి హామీలు రామారావుని గద్దే దింపిన తరువాత పక్కన పెట్టేసిన చరిత్ర చంద్రబాబు గారిదని, 1999లో కోటి ఉద్యోగాలు, లక్షల ఇళ్ల నిర్మాణం, ధరల స్థిరీకరణ నిధి, 2014లో సంపూర్ణ రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, డ్వాక్రా రుణమాఫీ, 2024లో ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్, పూర్ టు రిచ్ వంటి హామీల అమలు చేయని చరిత్ర చంద్రబాబుగారికి ఉంటే ఆయనకి విశ్వసనీయత ఉందని ఆయన సతీమణి ప్రజలకి చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు వాఖ్యానిస్తున్నారు.
అదే సమయంలో, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన విషయాన్ని కూడా వక్రీకరిస్తూ భువనేశ్వరీ గారు మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంత్రకరం అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ 1999లోనే ప్రకటించగా ఈ సత్యాన్ని వక్రీకరిస్తూ ఎన్నికల ముందిఉ మొదట ఈ హామీ విషయంలో తన దగ్గరకే వచ్చారని కానీ అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ హామీ అమలు సాధ్యం కాదని పలుమార్లు వ్యాఖ్యానించారని గుర్తు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ వల్ల భారీ ఆర్థిక భారం పడుతుందని, అది అమలు చేయడం అసాధ్యమని ఆయన వివిధ సందర్భాల్లో చెప్పినట్లు పేర్కొంటున్నారు.
కానీ 2004లో అధికారంలోకి వచ్చిన తొలి రోజే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ అమలు ఫైలుపై తొలి సంతకం చేసి, లక్షలాది వ్యవసాయ పంపుసెట్లకు 7 గంతల ఉచిత విద్యుత్ అందించారని 5ఏళ్ళలో 30 లక్షల పంపుసెట్లకు నిరాటంకముగా 1500 కోట్ల యూనిట్లు విద్యుత్ ఉచితంగా రైతులకు అందించబడింది.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకు ఇస్తోన్న ఏడుగంటల ఉచిత కరంటుకు అదనంగా మరో రెండు గంటలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారని. రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే సంతకం చేసిన తొలి ఫైలు అదేనని గుర్తు చేస్తున్నారు. అలాగే ఆయన పాలనలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచలేదని, రైతులపై చంద్రబాబు పరిపాలనలో నమోదైన పలు విద్యుత్ కేసులను కూడా ఉపసంహరించుకున్నారని గుర్తు చేస్తున్నారు.
ఇదే సమయంలో, గతంలో ఉచిత విద్యుత్ సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు నాయుడు, తర్వాతి ఎన్నికల్లో అదే ఉచిత విద్యుత్‌ను టీడీపీ మేనిఫెస్టోలో ఎలా చేర్చారో ప్రజలకి భువనేస్వరీ ఎందుకు వివరించలేదో చెప్పాలని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరిగారు చంద్రబాబు గారి ఇమేజ్ ని బిల్డ్ చేసే ప్రయత్నంలో దివంగత నేతపై అసత్యాలు ప్రచారం చేయడం అభ్యంత్రకరమని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.







