తెలంగాణ (Telangana) రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi – BRS) నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వీయ అస్తిత్వ పోరాటాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభమైన ఈ రాజకీయ శక్తి, పాతికేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం విశేషంగా మారింది.
ఈ చారిత్రాత్మక వేళలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే సందేశాన్ని విడుదల చేశారు. “నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా” అంటూ ప్రారంభమైన ఆయన ట్వీట్ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని కేటీఆర్ పునరంకిత సందర్భంగా అభివర్ణించారు. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా (Pink Flag) రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకలకు (Silver Jubilee Celebrations) చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అది ఒక విప్లవమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ దీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించామని, ఉద్యమం నుంచి అధికారానికి చేరుకుని తెలంగాణ స్వరంగా నిలిచిందని తెలిపారు.
పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా యోధులకు, నాయకులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోనూ అదే స్పూర్తి, అదే పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్ సందేశంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 25 ఏళ్ల చరిత్రను గుర్తు చేసుకుంటూ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…
— KTR (@KTRBRS) April 27, 2026
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!
స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..
సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!
25 వసంతాల మైలురాయిని అధిగమించిన
మహోజ్వల లాంగ్ మార్చ్!
బీఆర్ఎస్ రాజకీయ… pic.twitter.com/1vrQbOtCqL






