---Advertisement---

వ్యాపారవేత్త కిడ్నాప్ యత్నం వెనుక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు? సీబీఐకి మాజీ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ లేఖ

August 1, 2026

Summarize with AI

---Advertisement---

వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్‌పై (Madala Srinivas) జరిగినట్లు ఆరోపణలు వచ్చిన కిడ్నాప్ (Kidnap) యత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. బ్యాంకు వేలంలో (Bank Auction) డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు Raghu Rama Krishna Raju) చెందిన కంపెనీలను కొనుగోలు చేసిన అనంతరం కొందరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని శ్రీనివాస్ ఆరోపించారు. అంతేకాకుండా, రఘురామకృష్ణరాజే స్వయంగా ఫోన్ చేసి తాను పంపిన వ్యక్తులతో రావాలని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో తనకు ప్రాణహాని ఉందని భావించిన మాదాల శ్రీనివాస్, గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో (Pattabhipuram Police Station) ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరారు.

ఈ పరిణామాల నేపథ్యంలో రిటైర్డ్ డీజీ, మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) సీబీఐ డైరెక్టర్‌కు (CBI Director) లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై 2019లో రూ.947.71 కోట్లకు, 2021లో రూ.237.84 కోట్ల ప్రజాధనానికి సంబంధించిన రెండు సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐఓ (SFIO) కోరుతున్న రికార్డులకు సంబంధించి మాదాల శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం, పెండింగ్ కేసుల్లో సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సాక్షులను బెదిరించే ప్రయత్నంగా పరిగణించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అలాగే సీబీఐ(CBI) వెంటనే ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుని సంబంధిత కంపెనీల రికార్డులు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై లోతుగా దర్యాప్తు జరపాలని కోరారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత , 2023లోని సెక్షన్ 35 ప్రకారం అవసరమైతే అరెస్టు వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

ఒకవేళ సీబీఐ తక్షణ చర్యలు తీసుకోకపోతే ఇతర సాక్షులు కూడా భయపడి ముందుకు రాకపోవచ్చని, దర్యాప్తు నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని పీవీ సునీల్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment