కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఉద్యోగులకు (Employees) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund – PF) వేతన పరిమితిని (Salary Ceiling) రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. 2014 తర్వాత పీఎఫ్ వేతన పరిమితిని పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh, మంత్రి అశ్వనీ వైష్ణవ్(Ashwini Vaishnav), జేపీ నడ్డా (JP Nadda) తదితరులు ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. వేతన పరిమితి పెంపు నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 51 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రూ.11,339 కోట్ల అదనపు వ్యయం
ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న పీఎఫ్ వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచడంతో మరింత మంది ఉద్యోగులు పీఎఫ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలుకు ప్రభుత్వం ఏటా రూ.11,339 కోట్ల నిధులను కేటాయించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం రూ.11,339 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.
ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత
పీఎఫ్ వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు మరింత ప్రాధాన్యం లభించనుంది. ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉద్యోగుల పదవీ విరమణ (Retirement) సమయంలో అందే పొదుపు పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా పెన్షన్ పథకం (Pension Scheme) ద్వారా భవిష్యత్తులో లభించే ప్రయోజనాల్లోనూ మార్పు ఉండొచ్చు.
అంతేకాకుండా ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే బీమా ప్రయోజనాలు (Insurance Benefits) కూడా అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగుల సంక్షేమం, సామాజిక భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.








