---Advertisement---

అభివృద్ధిని అడ్డుకుంటూ, సంస్థలను తరలిస్తూ రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం.. సీమవాసుల ఆగ్రహం!

July 4, 2026

Summarize with AI

---Advertisement---

రాయలసీమ అభివృద్ధి(Rayalaseema Development) పట్ల తెలుగుదేశం ప్రభుత్వం (TDP Government) మొదటి నుండి అనుసరిస్తున్న తీరుపై సీమ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో అడుగులు పడ్డ కడప ఉక్కు పరిశ్రమ వంటి ప్రాజెక్టులను తామే చేశామని తెలుగుదేశం(TDP) ప్రచారం చేసుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన సుదీర్ఘ పాలనలో రాయలసీమకు దక్కిన అవకాశాలను ఎలా అడ్డుకున్నారో ప్రస్తావిస్తూ స్థానిక ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు.

రాయలసీమ లిఫ్ట్ (Rayalaseema Lift Irrigation) మరియు పోతిరెడ్డిపాడు (Pothireddypadu) అడ్డంకులు రాయలసీమ ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసం వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(Revanth Reddy) లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ ప్రాజెక్టును ఆపేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా రాయలసీమకు మేలు చేసేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ, తెలుగుదేశం నేత దేవినేని ఉమా (Devineni Uma Maheswara Rao) ఆధ్వర్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసి, రాయలసీమకు ఒక్క బక్కెట్ నీళ్లు తీసుకెళ్లినా రక్తం చిందిస్తామని హెచ్చరించడం సీమ ప్రజలు మర్చిపోలేరు
.
సీమకు అడుగడుగునా అన్యాయం రాయలసీమకు కేటాయించిన కీలక సంస్థలను అమరావతికి తరలించడం ద్వారా చంద్రబాబు సీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ప్రజలు భావిస్తున్నారు: విభజన చట్టం ప్రకారం రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ ఆసుపత్రిని, శ్రీభాగ్ ఒడంబడికకు విరుద్ధంగా అమరావతి సమీపంలోని మంగళగిరికి తరలించారు. కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు కావాల్సిన రూ. 250 కోట్ల ఎమ్మెస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను ప్రస్తుత ప్రభుత్వం అమరావతికి తరలిస్తూ జీవో 56 జారీ చేసింది
.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అడ్డుకోవడమే కాకుండా, అక్కడ రావాల్సిన లా యూనివర్సిటీని కూడా అమరావతికి తరలించారు. కడపలో సొంత భవనం కలిగి, అత్యుత్తమ వ్యాపార ఫలితాలు సాధిస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి
.
ఇక పులివెందుల మెడికల్ కాలేజీ (Medical College) సీట్ల నిలిపివేత పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ 50 సీట్ల అనుమతి ఇచ్చినా, మౌలిక వసతులు లేవనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఎన్ఎంసీకి (NMC) లేఖ రాసి ఆ సీట్లను వద్దని అడ్డుకుంది. మౌలిక వసతులు కల్పిస్తామని అండర్ టేకింగ్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిరాకరించడం, సీమ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని విమర్శలు వస్తున్నాయి.

జగన్ ప్రభుత్వ పథకాలను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కడప స్టీల్ ప్లాంట్, కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభమైన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు తవ్వకం ప్రాజెక్టు వంటి వాటిని చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని సీమ వాసులు అభిప్రాయపడుతున్నారు. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలను కూడా అమరావతికి తరలించేల ప్రభుత్వం ఉండటం చూస్తుంటే, రాయలసీమకు చంద్రబాబు పాలనలో మొదటి నుండి ద్రోహమే జరుగుతోందనేది స్పష్టమవుతోందని సీమ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment