కాంగోలోని(Congo) బుకావు (Bukavu) నగరంలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 19 మంది బాలికలు, 7 మంది బాలురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం.. బుకావు నగరంలోని ఓ ఇంట్లో(House) తొలుత మంటలు (Fire) చెలరేగాయి. చూస్తుండగానే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. ఈ క్రమంలో సమీపంలో ఉన్న 2 పాఠశాలలకు కూడా మంటలు వ్యాపించాయి.
పాఠశాలల్లో విద్యార్థులు (Students) ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అసలు అగ్నిప్రమాదానికి కారణమేంటి? ఇంట్లో చెలరేగిన మంటలు పాఠశాలలకు ఇంత వేగంగా ఎలా వ్యాపించాయి? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.








