---Advertisement---

ఇవాళే ధోని రిటైర్మెంట్..? అశ్విన్ ట్వీట్‌తో ఫ్యాన్స్‌లో టెన్షన్!

May 18, 2026

Summarize with AI

---Advertisement---

ఐపీఎల్ 2026లో (IPL 2026) ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్(CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య కీలక పోరు జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో సీఎస్‌కే తన హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న చివరి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) భవిష్యత్తుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

చెన్నైలో ఇవాళ జరిగే మ్యాచ్ అనంతరం ధోని రిటైర్మెంట్ (Dhoni Retirement) ప్రకటించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సీఎస్‌కే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ధోని చివరిసారి చెపాక్ మైదానంలో ఆడనున్నాడనే ప్రచారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పరిస్థితుల్లో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ధోని ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలు లేవని అశ్విన్ పేర్కొన్నారు. మరో 1 సంవత్సరం పాటు ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కొనసాగుతాడని ఆయన అంచనా వేశారు. 2027 సీజన్ ముగిసిన తర్వాతే ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

అంతేకాదు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ కోసం సీఎస్‌కే జట్టులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని అశ్విన్ వెల్లడించారు. ధోని మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కూడా తక్కువేనని అభిప్రాయపడ్డారు. అయితే అకేల్ హోసేన్‌కు (Akeal Hosein) మాత్రం తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అశ్విన్ వ్యాఖ్యలతో ధోని అభిమానులు కొంత ఊరట చెందుతున్నారు. మరో సీజన్ పాటు తమ అభిమాన ఆటగాడిని మైదానంలో చూసే అవకాశం ఉందనే వార్త సీఎస్‌కే ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment