రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కెరీర్లో ఎన్నో విజయాలు వచ్చినా, ‘ధురంధర్’(Dhurandhar) ఫ్రాంచైజీ (Franchise) అతని ఇమేజ్ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందిన రణ్వీర్, ఇప్పుడు భారీ స్పై యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. వరుస రికార్డులు సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తన వార్షిక లేఖలో జియో స్టూడియోస్ (Jio Studios) విజయాలను ప్రస్తావించడంతో ఈ ఫ్రాంచైజీపై మళ్లీ చర్చ మొదలైంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (Indian Express) కథనం ప్రకారం, షేర్ హోల్డర్లకు (Shareholders) రాసిన యాన్యువల్ లెటర్లో (Annual Letter) ముఖేష్ అంబానీ జియో స్టూడియోస్ సాధించిన ప్రత్యేక విజయాన్ని ప్రస్తావించారు. 2024లో ‘స్త్రీ 2’, 2025లో ‘ధురంధర్’, 2026లో ‘ధురంధర్: ది రివెంజ్’(Dhurandhar: The Revenge) సినిమాలతో వరుసగా 3 సంవత్సరాలు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థగా జియో స్టూడియోస్ నిలిచిందని పేర్కొన్నారు. ఈ విజయాలు సంస్థ దూరదృష్టి, వ్యూహాత్మక ప్రణాళికలకు నిదర్శనమని తెలిపారు.
ప్రత్యేకంగా ‘ధురంధర్’ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోగా, రెండో భాగం విడుదలయ్యే వరకు అది వరుసగా 15 వారాల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ ఈ ఫ్రాంచైజీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీ విజయంలో రణ్వీర్ సింగ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా రొమాంటిక్ పాత్రల్లో కనిపించే రణ్వీర్, ఈ సినిమాలో రఫ్ అండ్ రా స్పై ఆఫీసర్ పాత్రలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాలను సమతుల్యంగా మేళవించడం కూడా సినిమాల విజయానికి బలంగా మారింది.
ట్రేడ్ వెబ్సైట్ (Trade Website సాక్నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1812.96 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’(Dangal) తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జియో స్టూడియోస్ అమలు చేసిన అగ్రెసివ్ మార్కెటింగ్ వ్యూహాలు, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన విధానం కూడా ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఇప్పుడు ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ భారత్‌లో జూన్ 4 రాత్రి 7 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో (JioHotstar) డిజిటల్ ప్రీమియర్‌గా అందుబాటులోకి రానుంది. జూన్ 5 నుంచి రెగ్యులర్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. 5 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువ కానుంది.






