కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఉన్నతాధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌తో(Gyanesh Kumar) పాటు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు(Sukhbir Singh Sandhu), డాక్టర్ వివేక్ జోషి (Dr. Vivek Joshi) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల సంఘంలో ఇటీవల నెలకొన్న అంతర్గత అంశాలు, కమిషనర్ల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కమిషన్ పనితీరు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు అధికారుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
SIRపై ఓటర్లకు భారీ ఊరట
మరోవైపు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. SIR సర్వేలో భాగంగా నోటీసులు (Notices) అందుకున్న ఓటర్లు (Voters) తమ వివరాలు, అవసరమైన పత్రాలను సమర్పించేందుకు బూత్ లెవెల్ అధికారుల కార్యాలయాల (BLO Offices) చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.
ఇకపై నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకే బూత్ లెవెల్ అధికారులు (BLO) నేరుగా వెళ్లనున్నారు. అవసరమైన పత్రాలు, ఆధారాలను అధికారులు స్వయంగా పరిశీలించి సేకరించడంతో పాటు వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా SIR ప్రక్రియను సులభతరం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లు కార్యాలయాల వద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా తమ ఇళ్ల వద్దే (At Their Homes) అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది.








