---Advertisement---

Engineering Colleges:ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు… జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

March 6, 2026

Summarize with AI

---Advertisement---

తెలంగాణలో(Telangana) ఈఏపీసెట్ (EAPCET) ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల (Engineering Colleges) ట్యూషన్ ఫీజులపై (Tuition Fees) ఉన్న అనిశ్చితికి ప్రభుత్వం ముగింపు పలికింది. 2025–26 నుంచి 2027–28 వరకు మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్ (Block Period) కోసం రాష్ట్రంలోని 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఫీ నియంత్రణ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో అత్యధిక ట్యూషన్ ఫీజు ఒక ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో సుమారు రూ. 1.83 లక్షలుగా నిర్ణయించబడింది. ఇతర ప్రధాన కాలేజీలలో ఫీజులు రూ. 1.40 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉన్నాయి.

మొత్తం పరిశీలిస్తే 126 కాలేజీల్లో ఫీజులు రూ. లక్షలోపే ఉండగా, సుమారు 19 కాలేజీల్లో అత్యల్పంగా రూ. 45 వేల ఫీజు ఖరారు చేశారు. కొన్ని కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగుతుండగా, మరికొన్నింటిలో స్వల్ప పెంపు చోటు చేసుకుంది.

విద్యార్థులకు సౌకర్యంగా ఫీజును ఒకేసారి కాకుండా వాయిదాలుగా చెల్లించే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. నిర్ణయించిన ఫీజుకు మించి క్యాపిటేషన్ ఫీజు (Capitation Fee) లేదా విరాళాల (Donations) పేరుతో వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment