---Advertisement---

తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ..

May 21, 2026

---Advertisement---

తెలంగాణ రాష్ట్ర (Telangana State) మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా (Women Commission Chairperson) జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ (GHMC Former Mayor) గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మహిళల హక్కుల పరిరక్షణ, భద్రత, సాధికారత లక్ష్యంగా ఆమె కొత్త బాధ్యతల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గద్వాల విజయలక్ష్మిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆమె ఈ పదవిలో 5 సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.

గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా (GHMC Mayor) పనిచేసిన అనుభవం గద్వాల విజయలక్ష్మికి ఉంది. నగర పాలనలో పనిచేసిన అనుభవంతో మహిళల సమస్యల పరిష్కారం, వేధింపుల నివారణ, మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆమె కీలక పాత్ర పోషిస్తారని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై(Womens) జరుగుతున్న వివిధ సమస్యలపై వేగంగా స్పందిస్తూ మహిళలకు న్యాయం జరిగేలా మహిళా కమిషన్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మహిళా భద్రత, చట్ట పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై గద్వాల విజయలక్ష్మి ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment