గుంటూరు (Guntur) పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) గల్లా మాధవి (Galla Madhavi) భర్త, భ్రమర రియల్ ఎస్టేట్ అధినేత గల్లా రామచంద్రరావుపై (Galla Ramachandra Rao) మరోసారి ఫిర్యాదులు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. వినుకొండలో ఆయన అభివృద్ధి చేసిన వెంచర్లో (Venture) ప్లాట్లు కొనుగోలు (Plots Purchased) చేసిన బాధితులు (Victims) జిల్లా కలెక్టర్, వినుకొండ ఎమ్మెల్యే, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు (Lavu Sri Krishna Devarayalu) ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు.
బాధితుల కథనం ప్రకారం, ప్లాట్లు విక్రయించే సమయంలో పలు హామీలు ఇచ్చినప్పటికీ, కొనుగోలు అనంతరం వాటిని అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు. వెంచర్లో డ్రైనేజీ(Drainage), తాగునీరు(Drinking Water), విద్యుత్ (Electricity) వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, ఈసారి కూడా స్పందన రాకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇది గల్లా రామచంద్రరావుపై వచ్చిన తొలి ఆరోపణ కాదు. గతంలో పిడుగురాళ్లకు చెందిన రైతు కమ్మ వెంకటరావు (Kamma Venkata Rao) కూడా భూముల కొనుగోలు వ్యవహారంలో తనను మోసం చేశారని, చెక్కులు బౌన్స్ కావడం, మిగిలిన భూమిపై ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. తనపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారని కూడా ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై సంబంధిత న్యాయ, పోలీసు ప్రక్రియలు కొనసాగాయి.
మరోవైపు, మార్కాపురంలోని భ్రమర టౌన్షిప్కు వెళ్లే రహదారి విషయంలో కూడా వివాదం చెలరేగింది. గేటు, కంచె నిర్మాణాన్ని స్థానిక భూ యజమానులు వ్యతిరేకించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన వ్యక్తుల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చలేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త గల్లా రామచంద్రరావు పేర్లు వదిలేశారని ఆరోపించారు.
తాజాగా వినుకొండ వెంచర్ బాధితుల ఫిర్యాదులతో గల్లా రామచంద్రరావుపై గతంలో వెలుగులోకి వచ్చిన భూవివాదాలు, రియల్ ఎస్టేట్ (Real Estate) ఆరోపణలు మరోసారి చర్చకు వచ్చాయి. ప్రస్తుతం బాధితులు అధికార యంత్రాంగం జోక్యంతో తమ సమస్యలకు పరిష్కారం కోరుతున్నారు.







